టాలీవుడ్లో హీరోయిన్ల లైఫ్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది అని అంతా అనుకుంటారు.అది వట్టి భ్రమే అని కొంతమంది హీరోయిన్లు ప్రూవ్ చేస్తే.. కాదు నిజమే అని ఇంకొంతమంది హీరోయిన్లు ప్రూవ్ చేశారు.ఇప్పుడు ఆ ఇంకొంతమంది హీరోయిన్లలో ఒకరైన ఆమె కోసమే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆమె మరెవరో కాదు ‘బిందాస్’ మూవీ హీరోయిన్ షీనా షహబాది. మంచు మనోజ్ హీరోగా నటించిన ‘బిందాస్’ మూవీ 2010 లో రిలీజ్ డీసెంట్ హిట్ అందుకుంది.
ఆ టైంకి స్టార్ రైటర్ గా పేరు తెచ్చుకున్న వీరూ పోట్ల ఈ చిత్రంతో దర్శకుడిగా మారాడు. అనిల్ సుంకర నిర్మాత. రూ.3 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.10 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఓ రకంగా ప్రభాస్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ‘మిర్చి’ సినిమా కథ.. ‘బిందాస్’ కథకి చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. కాకపోతే ‘బిందాస్’ లో కొంచెం ఎక్కువ కామెడీ ఉంటుంది.
ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన షీనా షహబాది.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. మొదటి సినిమాతో సక్సెస్ అందుకుంటే ఏ హీరోయిన్ కు అయినా ఆఫర్లు కేక్ వాక్ అన్నట్టు వచ్చేస్తాయి. ఈ అమ్మడికి మాత్రం అలా రాలేదు.అందుకే భయపడి కథ గురించి ఆలోచించకుండా ఏ సినిమాకి పడితే ఆ సినిమాకి ఓకే చెప్పేసినట్టు ఉంది.
తర్వాత ఈ అమ్మడు చేసిన సినిమాలు హిట్ అవ్వలేదు. ‘తొలిసారిగా’ ‘నందీశ్వరుడు’ ‘యాక్షన్ 3D’ ‘నువ్వే నా బంగారం’ ‘గడ్డం గ్యాంగ్’ వంటి సినిమాల్లో ఈమె నటించింది. కానీ అవి సక్సెస్ కాలేదు. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె లుక్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. మీరు కూడా ఓ లుక్కేయండి :