Bindu Madhavi, Siva: నామినేషన్స్ లో హైలెట్ ఇదే..! అఖిల్ వల్లనే శివని బిందు నామినేట్ చేసిందా..!

బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం నామినేషన్స్ హీటెక్కిపోయాయనే చెప్పాలి. హౌస్ మేట్స్ దిష్టి బొమ్మపైన కుండని పగలకొట్టి మరీ నామినేట్ చేశారు. ఈసారి ఫస్ట్ టైమ్ బిందుమాధవి యాంకర్ శివని నామినేట్ చేయడంతో హౌస్ మేట్స్ తో పాటుగా, ఆడియన్స్ కూడా షాక్ తిన్నారు. ఎందుకంటే, ఫస్ట్ వీక్ నుంచీ బిందు , శివ ఇద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ గా కలిసిమెలిసి ఉన్నారు. టాస్క్ లు వచ్చినపుడు ఎవరి గేమ్ వాళ్లు ఆడినా కూడా ఆ తర్వాత ఇద్దరూ కలిసే ఉన్నారు.

Click Here To Watch NOW

శివ ఫస్ట్ వీక్స్ లో జైలుకి వెళ్లినపుడు బిందు మాధవి జైలు పక్కనే కింద పక్కవేసుకుని మరీ పడుకుంది. అలాంటి ఫ్రెండ్షిప్ బాండింగ్ కలిగిన వీళ్లు ఇప్పుడు కేవలం అకిల్ వల్లనే విడిపోవాల్సి వచ్చిందా అంటే నిజమే అనిపిస్తోంది. అసలు మేటర్లోకి వెళితే.,,గతవారం నామినేషన్స్ అప్పుడు రైజ్ అయిన బాత్రూమ్ ఇష్యూని హౌస్ట్ నాగార్జున వచ్చి క్లియర్ చేశాడు. అఖిల్ ఉద్దేశ్యం అస్సలు అది కాదని క్లియర్ గా చెప్పాడు. బాత్రుమ్ అని నా నోట్లో నుంచీ ఎందుకు అలా రావాల్సింది కాదని, ఎందుకు అన్నానో కూడా తెలియదని అఖిల్ తేల్చి చెప్పేశాడు.

దీంతో బిందు మాధవి శివని నిలదీసింది. అసలు మేటర్ ఏంటి చెప్పు అంటూ అడిగింది. కానీ శివ చెప్పలేదు. నిజానికి లాస్ట్ వీక్ నామినేషన్స్ అప్పుడు ఈ పాయింట్ తీస్కుని వస్తే నా వైపు సపోర్ట్ చేయమని బిందు శివని అడిగింది. కానీ, శివ నీకే గుర్తు లేని పాయింట్ ని నేను ఎలా చెప్తాను అంటూ ఆర్గ్యూమెంట్ చేశాడు. అప్పట్నుంచీ ఇద్దరికీ చెడింది. ఫ్రెండ్షిప్ లో కూడా తేడాలు వచ్చేశాయి. ఇప్పుడు ఇదే పాయింట్ ని తీస్కుని నామినేట్ చేసింది బిందు.

శివ కొద్దిగా షాక్ అయినా కూడా తర్వాత బిందుకి సాలిడ్ గా సమాధానం చెప్పాడు. అసలు మేటర్ లేని పాయింట్ ని నన్ను అడిగితే అప్పటికప్పుడు ఎలా చెప్తాను అంటూ బిందుకి ఆన్సర్ ఇచ్చాడు. ఇద్దరి మద్యలో గట్టిగా ఆర్గ్యూమెంట్ అనేది జరిగింది. అఖిల్ వేసిన డైలాగ్ కి అఖిల్ ఈవారం కెప్టెన్ కాబట్టి నామినేట్ చేయలేకపోయింది బిందు. లేదంటే శివ నామినేషన్ ఖచ్చితంగా అఖిల్ కి పడేది. అయితే, ఇక్కడే అఖిల్ బిందు – శివ ఆర్గ్యూమెంట్ లో అస్సలు ఇన్వాల్ అవ్వలేదు.

వీకండ్ నాగార్జున ఈ ఇష్యూని క్లోజ్ చేసినా కూడా బిందు మరోసారి తెరపైకి తీస్కుని వచ్చి, నాకు ఆ వారం నువ్వు సపోర్ట్ గా నిలబడలేదని, బ్యాక్ స్టెప్ తీస్కున్నావని శివని నామినేట్ చేయడం విశేషం. మొత్తానికి ఫ్రెండ్స్ నామినేట్ చేసుకోవడం అనేది ఈవారం నామినేషన్స్ లో హైలెట్ గా నిలిచింది. అదీ మేటర్.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus