Bindu, Akhil: అఖిల్ నిజంగా బిందుని అంతమాట అన్నాడా..! అసలు జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ హీటెక్కిపోయాయి. 8వ వారం నామినేషన్స్ లో భాగంగా హౌస్ మేట్స్ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ఎప్పటిలాగానే బిందుమాధవికి – అఖిల్ కి టఫ్ ఫైట్ జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. అయితే , ఇక్కడ బిందుమాధవికి అఖిల్ పై ఏ పాయింట్ లేవనెత్తాలా అనే సమస్య ఎదురైంది. అందుకే, కెప్టెన్ అయిన శివని బాత్రూమ్ ఇష్యూలో జరిగిన పాయింట్ అడిగింది. అసలు అదేం పాయింటో నాకు గుర్తులేదు అంటూ శివ చెప్పలేదు.

Click Here To Watch NOW

కానీ, బిందు మాత్రం ఇదే పాయింట్ పై అఖిల్ ని నామినేట్ చేసింది. అంతేకాదు, ఇద్దరి మద్యలో మరోసారి స్రవంతి ఇష్యూని తీస్కుని వచ్చారు. అసలు ఈ బాత్రూమ్ ఇష్యూ ఏంటి ఏం జరిగింది అనేది యాంకర్ శివ తర్వాత ఎక్స్ ప్లయిన్ చేశాడు. ఈ పాయంట్ పై బిందు నామినేట్ చేస్తుంటే అఖిల్ తనని తాను డిపెండ్ చేసుకున్నాడు. బిందుమాధవి వాష్ రూమ్ లోకి వెళ్లి వస్తుంటే అఖిల్ కామెంట్ చేశాడని, అమ్మాయి కాబట్టి నేను బయటకి చెప్పడం లేదంటూ మాట్లాడాడు అని పాయింట్ చెప్పింది బిందు.

అసలు అఖిల్ అక్కడ బాత్రూమ్ అని ఎందుకు అన్నానో తెలీదు అని, అసలు ఈవిషయాన్ని అషూతో కూడా చెప్పానంటూ చెప్పాడు. ఇక బిందు ఎక్కడా తగ్గలేదు. నా పక్కకి రావడం నీకు అంత ఇష్టమా అంటూ నువ్వు మాట్లాడావ్ అని బిందు అనేసరికి, నా మీదకు వస్తున్నావ్ డిస్టాన్స్ మైయిన్ టైన్ చేయి అంటే , అవునా నామీదకి రావడం అంత ఇష్టం మరీ అని నువ్వు అన్నావని వెంటనే నేను అంత ఇష్టముంటే పక్కకి కూర్చుని కాఫీ తాగుదాం అన్నాను అని రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వొద్దని స్ట్రాంగ్ గా చెప్పాడు అఖిల్.

ఆ తర్వాత గర్ల్ కార్డ్ యూజ్ చేశానని చాలాసార్లు అన్నావని, నేను అలా ఆడను అని క్లియర్ గా చెప్పింది. నేను మెన్ లాగా ఫైట్ చేస్తా, ఉమెన్ లాగా ఫైట్ చేస్తా, ట్రాన్స్ జెండర్ లాగా ఫైట్ చేస్తా అంటూ ఛాలెంజ్ చేస్తూ రెచ్చిపోయింది బిందు. ఇద్దరి మద్యలో గట్టి ఆర్గ్యూమెంట్ అయ్యింది. ఈ నామినేషన్స్ ప్రక్రియ అయిపోయిన తర్వాత అసలు వాష్ రూమ్ ఇష్యూ ఏంటి అకిల్ అంటూ వచ్చి చాలా కూల్ గా అడిగింది బిందు.

నిజానికి ఈ పాయింట్ పై శివతో చాలాసేపు ఆర్గ్యూచేసింది. యాంకర్ శివ బిందుపై అరిచాడు. పాయింట్ ముందు తెలుసుకో ఆ తర్వాత నేను స్టాండ్ తీస్కుంటా కానీ, అసలు ఏ పాయింట్ లేకుండా నేను ఎలా మాట్లాడతాను అంటూ బిందుపై గట్టిగా అరిచాడు. దీంతో ఇద్దరి ఫ్రెండ్షిప్ కి దూరం పెరిగింది. ఆ తర్వాత అఖిల్ దగ్గరకి వచ్చి అమ్మాయి కాబట్టి చెప్పడం లేదు, చూశాను బాత్రూమ్ దగ్గర ఏం జరిగిందో అని క్లియర్ గా అన్నావ్ అంటూ అకిల్ ని నిలదీసింది బిందుమాధవి.

తర్వాత నైట్ శివ బిందు బెడ్ దగ్గరకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా బిందుమాధవి ప్లీజ్ దాని గురించి మాట్లాడద్దు అంటూ ఎవైడ్ చేసింది. జరిగింది నీకు తెలిసి కూడా స్టాండ్ తీస్కోవడానికి భయపడ్డావ్ అని , బ్యాక్ స్టెప్ తీస్కున్నావని శివతో ఆర్గ్యూ చేసింది. మొత్తానికి అదీ మేటర్.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus