స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన పుష్ప ది రైజ్ థియేటర్లలో విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బీజీఎం విషయంలో దేవిశ్రీ ప్రసాద్ పై విమర్శలు వ్యక్తమవుతున్నా పుష్ప పాటలు మాత్రం బాగున్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో ఊ అంటావా మామా పాట వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
కొంతమంది ఈ పాటపై కోర్టులో కేసులు వేయగా మరికొందరు సోషల్ మీడియా వేదికగా ఈ పాట విషయంలో విమర్శలు చేశారు. అయితే పుష్ప ది రైజ్ ప్రమోషన్స్ లో భాగంగా దేవిశ్రీ ప్రసాద్ తనకు భక్తి పాటలు, ఐటమ్ సాంగ్స్ ఒకటేనని కామెంట్లు చేయడంతో పాటు ఆర్య2 సినిమాలోని రింగ రింగ, పుష్ప ది రైజ్ లోని ఊ అంటావా మామా పాటలను డివోషనల్ లిరిక్స్ లో పాడారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చాలామందికి ఆగ్రహం తెప్పించాయి.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దేవిశ్రీ ప్రసాద్ కామెంట్ల గురించి స్పందిస్తూ దేవిశ్రీ ప్రసాద్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని భక్తి పాటలను ఐటమ్ సాంగ్స్ తో పోల్చడం కరెక్ట్ కాదని రాజా సింగ్ కామెంట్లు చేశారు. దేవిశ్రీ క్షమాపణలు చెప్పకపోతే తెలంగాణలో ఆయనను తిరగనివ్వమని రాజా సింగ్ అన్నారు. దేవిశ్రీ తీరుపై రాజాసింగ్ మండిపడటంతో పాటు హైదరాబాద్ పోలీసు కమిషనర్ కు రాజా సింగ్ లేఖ రాశారు.
దేవిశ్రీ ప్రసాద్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ కమిషనర్ ను కోరారు. అయితే ఈ వివాదం గురించి దేవి శ్రీ ప్రసాద్, పుష్ప మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు పుష్ప నెగిటివ్ కామెంట్లపై సుకుమార్ స్పందిస్తూ పుష్ప అసలు కథ సెకండాఫ్ లో ఉందని పార్ట్ 2లో మరో మూడు పాత్రలు యాడ్ అవుతాయని అన్నారు. పుష్ప ది రూల్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అని సుకుమార్ తెలిపారు.