Rajamouli: రాజమౌళి ఫ్యామిలీకే అవార్డులన్నీ!

  • January 27, 2023 / 02:04 PM IST

తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళికి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీ మొత్తం కూడా ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తుంది. ప్రస్తుతం కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ అండదండలు రాజమౌళి ఫ్యామిలీకి పుష్కలంగా ఉన్నాయనే మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దానికి పద్మ పురస్కారాలను, రాజ్యసభ సీటుని ఉదాహరణగా చూపిస్తున్నారు. రీసెంట్ గా కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డ్స్ లో కీరవాణికి పద్మశ్రీ దక్కింది.

ఆయన కంటే ఏడేళ్ల ముందు రాజమౌళి పద్మశ్రీ అందుకున్నారు. 2016లోనే రాజమౌళికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. అప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. ఇప్పుడు కీరవాణికి పద్మశ్రీ వచ్చింది. ఇప్పుడు కూడా కేంద్రంలో బీజీపీనే అధికారంలో ఉంది. ఈ రెండు మాత్రమే కాదు.. రాజమౌళి ఫ్యామిలీ మెంబర్ కి రాజ్యసభ సీటు కూడా ఉంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభ సభ్యుడు. ఆయన్ని రాష్ట్రపతి కోటాలో గతేడాది నామినేట్ చేశారు.

ఆయనతో పాటు సంగీత దర్శకుడు ఇళయరాజాను కూడా నామినేట్ చేశారు. తాను రాసిన కథలే తనను రాజ్యసభ వరకు తీసుకెళ్లాయని చెబుతారు విజయేంద్రప్రసాద్. ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేసిన సమయంలో చాలా మంది విమర్శించారు. ఈహే ఆయన టాలెంట్ ని తక్కువ చేసి మాట్లాడలేం. రాజమౌళి సినిమాలకు అద్భుతమైన కథలను అందించేది ఆయనే. సంగీత దర్శకుడిగా కీరవాణి పని చేస్తుంటారు.

ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇండియా రేంజ్ చాటుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వెనుక కూడా వీరు ముగ్గురూ ఉన్నారు. దీంతో కేంద్రం ఈ ఫ్యామిలీపై స్పెషల్ ఫోకస్ చేసిందనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఏది ఏమైనా.. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్లిందంటే దానికి కారణం రాజమౌళి ఫ్యామిలీనే. ఇప్పుడు అందరి కళ్లు ఆస్కార్ మీదే ఉన్నాయి.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus