ఆది సాయికుమార్ బర్త్ డే సందర్భంగా ‘బ్లాక్’ ఫస్ట్ లుక్ విడుదల..!

ఆది సాయి కుమార్ హీరోగా మహాంకాళి మూవీస్ బ్యానర్‌పై మహాంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం బ్లాక్. కొత్త దర్శకుడు జిబి కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 23న ఆది పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. క్రైమ్ త్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆదికి జోడీగా దర్శన బానిక్ నటిస్తున్నారు. ఆది కెరీర్లో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు.

ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేస్తున్నారు, ఖచ్చితంగా హిట్టు కొడతామంటున్నారు మేకర్ల. ఈ సినిమాలో కౌశల్ మందా, ఆమని, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అమర్ రెడ్డి ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేస్తుండగా.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. చిత్రం రిలీజ్ వివరాలు చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనున్నారు.


2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus