Jr NTR Family: నార్నే నితిన్ ఎంగేజ్మెంట్.. ఆ అమ్మాయి ఎవరంటే..?

టాలీవుడ్‌లో పెళ్లి పీటలెక్కుతున్న యువహీరోల జాబితాలో నార్నే నితిన్  (Narne Nithin)  కూడా చేరాడు. ఎన్టీఆర్  (Jr NTR)  బామ్మర్దిగా సినిమాల్లోకి రాకముందే నితిన్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే మంచి విజయాలను అందుకున్నాడు. అలాగే ఇప్పుడు ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం హైదరాబాద్‌లో నితిన్ ఎంగేజ్మెంట్ వేడుక ఎంతో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రత్యేకించి, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం పూర్తిగా ఈ వేడుకలో పాల్గొనడం విశేషం.

Jr NTR Family

తారక్ తన భార్య ప్రణతితో పాటు కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో వచ్చి నూతన జంటను ఆశీర్వదించారు. అలాగే కళ్యాణ్ రామ్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నార్నే నితిన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు శివాని. నెల్లూరుకు చెందిన ఈ అమ్మాయితో నితిన్ మరికొన్ని రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.

శివాని కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబంగా పేరొందింది. అంతేకాకుండా, ఆమెకు సీనియర్ హీరో వెంకటేష్ ఫ్యామిలీకి సన్నిహిత బంధం కూడా ఉందని సమాచారం. చాలామంది సెలబ్రెటీలు వీరి వివాహానికి హాజరయ్యే అవకాశం ఉంది. నితిన్ కెరీర్ విషయానికి వస్తే, బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా తన కష్టంతోనే హీరోగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇటీవల విడుదలైన మ్యాడ్ (MAD) చిత్రంలో హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరించి, మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

ఈ చిత్రం విజయంతో నితిన్ సొంతంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. అటువంటి విజయం తర్వాత వచ్చిన ఆయ్ (AAY)  చిత్రంతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుని గోదారి ప్రాంతం నేపథ్యంలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం మ్యాడ్ సీక్వెల్ లో కూడా నటిస్తున్నాడు. మరో రెండు ప్రాజెక్టులు కూడా లైన్ లో ఉన్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus