మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమాలో మరో బాలీవుడ్ నటి

‘ఎస్.ఎస్.ఎం.బి 28’ అనే వర్కింగ్ టైటిల్ తో మహేష్ బాబు – త్రివిక్రమ్ ల మూడో సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కీలక షెడ్యూల్ జరుగుతుంది. మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీల,రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ వంటి వారు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ ను శరవేగంగా ఫినిష్ చేయాలని దర్శకుడు త్రివిక్రమ్ భావిస్తున్నాడు. కేవలం ఈ ఒక్క షెడ్యూల్ కే రూ.10 కోట్లు ఖర్చవుతుందట.

ఫస్ట్ షెడ్యూల్ లో కొన్ని లవ్ సీన్స్ ను, యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించాడు త్రివిక్రమ్. ఈ మూవీలో బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్ కూడా కీలక పాత్ర పోషిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ చిత్ర బృందం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే.. ఈ ప్రాజెక్టులో మరో బాలీవుడ్ నటి ఎంపికైనట్టు కథనాలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. నిన్నటి తరం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖని… ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రకు ఎంపిక చేసుకున్నాడట త్రివిక్రమ్.

ప్రస్తుతం ఈ విషయం పై ఆమెతో చర్చలు జరుగుతున్నాయట. ఆమె ఈ ప్రాజెక్టులో నటించడానికి అంగీకరిస్తూ సైన్ చేస్తే.. నిర్మాతలు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటిస్తారు. త్రివిక్రమ్ తన గత సినిమాల్లో కూడా బాలీవుడ్ స్టార్స్ ను ఎంపిక చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. బోమన్ హిరానీ, టబు, సోను సూద్ వంటి బాలీవుడ్ నటీనటులు త్రివిక్రమ్ సినిమాల్లో నటించారు.

కాబట్టి.. రేఖ కూడా ఎంపికైనా ఆశ్చర్యపడనవసరం లేదు. కానీ ఇంతమంది బాలీవుడ్ నటీనటులు తెలుగు సినిమాలో అవసరమా.. బహుశా పాన్ ఇండియా ప్లానింగ్ కోసమయ్యి ఉంటుంది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus