Balayya Babu:ఆ హీరోయిన్ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ సంతృప్తితో లేరా?

బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా ఎంపికయ్యారని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ప్రియమణికి బదులుగా అనిల్ రావిపూడి సోనాక్షి సిన్హాను ఈ సినిమాలో ఫైనల్ చేశారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఈ హీరోయిన్ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ సంతృప్తిగా లేదు. సోనాక్షి సిన్హా సౌత్ లో నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించలేదని

ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేయకపోతే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు. బాలయ్య సినిమాలకు సౌత్ హీరోయిన్లు అయితే బాగుంటారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే సోనాక్షి సిన్హా ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. అధికారిక ప్రకటన రాకుండానే కామెంట్లు చేయడం సరికాదని మరి కొందరు చెబుతున్నారు. బాలయ్య అనిల్ కాంబో మూవీలో బాలయ్య కూతురి రోల్ లో శ్రీలీల కనిపించనున్నారు.

ఈ సినిమాకు శ్రీలీల కూడా భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని బోగట్టా. ఈ సినిమాకు బాలయ్య పారితోషికం 15 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. బాలయ్య సినీ కెరీర్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న సినిమా ఇదేనని సమాచారం. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.

పటాస్ తర్వాత వరుసగా దిల్ రాజు బ్యానర్ లోనే సినిమాలను తెరకెక్కించిన అనిల్ రావిపూడి చాలా కాలం తర్వాత మరో బ్యానర్ లో సినిమా చేస్తుండటం గమనార్హం. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అనిల్ రావిపూడి తన శైలికి భిన్నమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. బాలయ్య ఖాతాలో ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus