‘కాంతార’, ‘పుష్ప’పై స్టార్‌ దర్శకుడి షాకింగ్‌ కామెంట్స్‌!

  • December 13, 2022 / 12:33 PM IST

బాలీవుడ్‌ ప్రేక్షకులపై సౌత్‌ సినిమాల ప్రభావం ఎక్కువైంది.. అక్కడ తీసే సినిమాలను వాళ్లు చూడటం లేదు అంటూ గత కొన్ని నెలలుగా బాలీవుడ్‌ జనాలు వాపోతున్నారు. ఇక్కడి వైవిధ్యం, భారీతనం, బరువైన కథలు, తెలివైన స్క్రీన్‌ప్లేకు అక్కడి జనాలు ముచ్చటపడిపోయి మరీ చూస్తున్నారని అంటున్నారు. ఇదంతా వినడానికి సౌత్‌ సినీ జనాలకు ఆనందంగా ఉండొచ్చు. అయితే ఇదెన్ని రోజులు అనేది చెప్పలేం. ఎందుకంటే ఎక్కడా వైవిధ్యం ఎక్కువ రోజులు ఉండదు.. ఉన్నా నచ్చదు.

ఇలా సౌత్‌ సినిమాల గురించి అందరూ పొగుడుతుంటే.. బాలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ మాత్రం భిన్నంగా స్పందించారు. అయితే అందులోనూ పొగడ్తలే ఉన్నాయి. నిందాస్తుతి అనే కాన్సెప్ట్‌లో ఆయన ఆ మాటలు చెప్పారులెండి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. బాలీవుడ్‌లోనూ ఈ ట్రెండ్‌పై ఇక్కడి మేకర్స్ దృష్టి పెడుతున్నారు. అయితే ఆ ఆలోచనే బాలీవుడ్‌ను నాశనం చేస్తోంది అని అనురాగ్‌ కశ్యప్‌ అన్నారు.

బాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాల ప్రస్తావన ఎప్పుడూ ఉండేది కాదు. అయితే ఆలోచన చేస్తుండటంతో.. బాలీవుడ్ ఇండస్ట్రీ తనను తాను నాశనం చేసుకున్నట్లు అవుతోందని వ్యాఖ్యానించారు అనురాగ్‌ కశ్యప్‌. ‘పుష్ప’, ‘కాంతార’, ‘కేజీయఫ్‌ 2’ సినిమాలు దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించవచ్చు, కానీ అలాంటి సినిమాలను బాలీవుడ్‌లో, అలానే తీస్తే భారీ నష్టం వస్తుంది. అందుకే ఇప్పుడు బాలీవుడ్‌కి ఇప్పుడు కావాల్సింది పాన్ ఇండియా సినిమాలు కాదు, ఇండస్ట్రీ కి ధైర్యాన్నిచ్చే సినిమాలు అని చెప్పారు.

‘కాంతార’ సినిమాను పాన్ ఇండియా ఆలోచనలో తీయలేదు. కన్నడలో ఆ సినిమాకు మంచి స్పందన రావడంతో… పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేశారు. దీని బట్టి చూస్తే సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు తప్ప.. లోకల్, పాన్ ఇండియా అని ఉండదు అని విశ్లేషించారు అనురాగ్‌. ప్రస్తుతం ఆయన వ్యాపార వేత్త విజయ్ మాల్యా జీవితం ఆధారంగా ‘ఫైల్ నెం 323’ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus