వివాదాస్పద ట్వీట్స్ చేయటంతో ప్రముఖ ఫిలిమ్ క్రిటిక్ ను అరెస్టు చేసిన పోలీసులు?

బాలీవుడ్ ఫిలిమ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్‏ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన ఫిలిమ్ క్రిటిక్ గా వ్యవహరిస్తూ పలు సినిమాలకు రివ్యూ ఇస్తూ పెద్ద ఎత్తున వివాదాలకు తెరతీస్తుంటారు. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్ హీరోల సినిమాల గురించి వివాదాస్పదమైన రివ్యూలు స్వీట్లు చేయడంతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈయన తాజాగా మరోసారి కాంట్రవర్సీ ట్వీట్ చేయటం ద్వారా ఈయనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈయన చేసిన ట్వీట్ 2020 సంవత్సరంలో చేసినది కావడం విశేషం.

ఇలా గతంలో చేసిన ఈ ట్వీట్ విషయంపై కేసు ఫైల్ కావడంతో ముంబై పోలీసులు మంగళవారం ఉదయం ఎయిర్ పోర్టులో ఇతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈయన 2020 వ సంవత్సరంలో ఇర్ఫాన్, రిషి కపూర్ ల గురించి పలు ట్వీట్స్ చేశాడు. దీంతో యువసేన సభ్యుడు రాహుల్ కనల్ కమల్ ఆర్ ఖాన్ పై మలాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలా గతంలో ఈయన చేసిన ఈ ట్వీట్ కారణంగా ప్రస్తుతం పోలీసులు తనని అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలోనే నేడు కెఆర్కెను బోరివలి కోర్టులో హాజరు పరచనున్నారు.

అయితే ఈయన తరచూ పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు ఇలా గతంలో సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ వంటి సెలబ్రిటీల విషయంపై పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలిచారు. ఈ విధంగా నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కెఆర్కెను నేడు ముంబై పోలీసులు అరెస్టు చేశారు అయితే ఈయన ఫిలిమ్ క్రిటిక్ గా గుర్తింపు పొందడమే కాకుండా,

హిందీ బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఈయన పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయారని చెప్పాలి. ఇకపోతే ఈయన ఎన్నోసార్లు స్టార్ సెలబ్రిటీలపై ఇలాంటి అసభ్యకర పదజాలంతో ట్వీట్లు చేస్తూ ఉండటంతో ఇది సరైంది కాదని భావించిన రాహుల్ కనకల్ ఆయనపై కేసు నమోదు చేశారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus