Naatu Naatu: చరణ్ తారక్ లను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు.. మా స్టెప్స్ కాపీ కొట్టొద్దంటూ?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు సాంగ్ ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాటకు ఆస్కార్ అవార్డ్ వచ్చిందంటే సినీ అభిమానులకు ఈ పాట ఏ రేంజ్ లో ఆకట్టుకుందో సులువుగా అర్థమవుతుంది. ఈ పాట ఈ స్థాయిలో హిట్ కావడానికి ప్రేమ్ రక్షిత్ డ్యాన్స్ స్టెప్స్ కూడా కారణమని చెప్పవచ్చు. ప్రేమ్ రక్షిత్ చరణ్ తారక్ లతో అదిరిపోయే స్టెప్పులు వేయించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అయితే బాలీవుడ్ హీరోలు ఈ స్టెప్ ను కాపీ చేయడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. బడే మియా చోటే మియా సినిమాలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటిస్తుండగా ఆ సినిమా నుంచి తాజాగా మస్త్ మలంగ్ జూమ్ అనే సాంగ్ విడుదలైంది. ఈ పాటలో హీరోలు వేసిన స్టెప్స్ నాటు నాటు సాంగ్ ను పోలి ఉండటంతో చరణ్, తారక్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మా హీరోల స్టెప్స్ కాపీ కొట్టొద్దంటూ కామెంట్లు చేశారు.

నాటు నాటు (Naatu Naatu) హూక్ స్టెప్ ను చరణ్, తారక్ రేంజ్ లో ఎవ్వరూ మ్యాచ్ చేయలేరంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. కాపీ కామెంట్ల గురించి బడే మియా చోటే మియా మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇలాంటి కాపీ కామెంట్ల వల్ల సినిమాల స్థాయి తగ్గుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఊహించని స్థాయిలో హిట్టైన సాంగ్ ను కాపీ చేయడం ఏంటని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు చరణ్, తారక్ ఫ్యాన్స్ ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్ కు సంబంధించి ఏదైనా అప్ డేట్ ఇవ్వాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చరణ్, తారక్ పారితోషికాలు భారీ రేంజ్ లో ఉండగా ఈ కాంబోలో సినిమా తీయాలంటే 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సినిమా సీక్వెల్ అప్ డేట్ వస్తుందో చూడాలి.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus