ఈ బాలీవుడ్ నటి చెప్పిన రీజన్ భలే ఉందిగా!

పుష్ప ది రైజ్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాయనే సంగతి తెలిసిందే. ఈ సినిమాల విజయాల వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ సినిమాలకు సంబంధించి జోరుగా చర్చ జరుగుతోంది. యాక్షన్ కథాంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలు భాషతో సంబంధం లేకుండా విజయం సాధించగా ఈ సినిమాల సక్సెస్ తో ఈ స్టార్ హీరోల మార్కెట్ కూడా పెరిగింది. సౌత్ సినిమాల వల్లే నార్త్ ఇండియాలోని థియేటర్లు కళకళలాడాయని కొందరు థియేటర్ల ఓనర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రముఖ బాలీవుడ్ నటి రిచా చద్దా మాత్రం పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాల సక్సెస్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సౌత్ సినిమాలకు టికెట్ రేట్లు తక్కువగా ఉండటం వల్లే పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలు నార్త్ ఇండియాలో అంచనాలకు మించి కలెక్షన్లను సాధించాయని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బేబీ డాల్ అనే ఆడియో ప్రాజెక్ట్ చేస్తున్న ఈ నటి తక్కువ టికెట్ రేట్లతో సినిమాలను చూడటానికి ఫ్యాన్స్ కు పెద్దగా ఇబ్బంది లేదని ఆమె చెప్పుకొచ్చారు.

సౌత్ సినిమాలకు 100 రూపాయల నుంచి 400 రూపాయల వరకు టికెట్ రేట్లు ఉంటే హిందీ సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా టికెట్ రేటు 500 రూపాయలుగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. అంత మొత్తం ఖర్చు చేయడానికి ఫ్యాన్స్ ఆసక్తి చూపరని ఆమె చెప్పుకొచ్చారు. మధ్యతరగతి ప్రజలలో చాలామంది 500 రూపాయలు ఉంటే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయవచ్చని భావిస్తారని ఆమె కామెంట్లు చేశారు.

బాలీవుడ్‌లో డిస్ట్రిబ్యూషన్ వర్గం అత్యాశ వల్లే బాలీవుడ్ ఇండస్ట్రీ నష్టపోతుందని ఆమె చెప్పుకొచ్చారు. పంపిణీదారులలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. రిచా చద్దా చేసిన కామెంట్లు కూడా నిజమేనని కొంతమంది చెబుతున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus