Star Producer: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత సతీమణి మృతి!

బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకనిర్మాత దివంగత యశ్‌ చోప్రా భార్య నిర్మాత, సింగర్‌ పమేలా(74) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను 15 రోజుల క్రితం ముంబై లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. న్యూమోనియాతో బాధపడుతున్న పమేలా చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఉదయం 11 గంటలకు ముంబైలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. పమేలా భర్త, ప్రముఖ నిర్మాత యశ్‌చోప్రా 2012లో మృతి చెందారు.

పమేలా చోప్రాకు (Star Producer) ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు ఆదిత్య కపూర్ యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేతగా ఉన్నారు. చిన్న కొడుకు ఉదయ్ చోప్రా నటుడిగా, కమెడియన్ గా బాలీవుడ్ లో రాణిస్తున్నారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ పమేలాకు కోడలు. ఆమె ఆదిత్య చోప్రాను పెళ్లాడింది. పమేలా చోప్రా 1949 జూలైలో జన్మించారు. కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా యశ్‌ చోప్రా కుటుంబంతో అనుబంధం ఏర్పడింది. 1970లో పమేలా యశ్‌ చోప్రాను వివాహం చేసుకున్నారు.

ఎన్నో హిట్‌ సినిమాల్లో పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నారు. కథా రచయితగా, గాయనిగా, డ్రెస్‌ డిజైనర్‌గానే కాకుండా యశ్‌ రాజ్‌ సంస్థలో పలు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన అనుభవం ఉంది. యశ్ చోప్రాతో పెళ్లి అనంతరం యశ్ రాజ్ ఫిలిమ్స్ లో నిర్మాణ బాధ్యతలు చూసుకున్నారు. ఇటీవల కొన్నాళ్ల క్రితం కూడా ఆమె నెట్ ఫ్లిక్స్ కోసం ఓ డాక్యుమెంటరీలో నటించింది.

యశ్‌ చోప్రా దర్శక నిర్మాతగా రూపొందిన ‘దిల్‌ తో పాగల్‌ హై’, ‘కబీ కబీ’ చిత్రాలకు పమేలా రచయితగా పనిచేశారు. ఆమె మరణ వార్త తెలుసుకుని బాలీవుడ్‌ కన్నీరుమున్నీరైంది. పమేలా చోప్రా మరణించిందని తెలియడంతో అమితాబ్, షారుఖ్, సల్మాన్, విక్కీ కౌశల్, కత్రీనా, రణవీర్, దీపికా, హృతిక్, అమీర్ ఖాన్.. ఇలా అనేక మంది బాలీవుడ్ స్టార్స్ వారి ఇంటికి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus