బాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బోనీకపూర్ తాజాగా శ్రీదేవి గురించి అలాగే ఆమె మరణం తన కుమార్తె గురించి పలు విషయాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నటి శ్రీదేవి బోని కపూర్ ను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరి వివాహం అనంతరం ఈ దంపతులకు జాన్వీ కపూర్ ఖుషి కపూర్ జన్మించారు.
ఇక శ్రీదేవి మరణాంతరం ఆమె వారసురాలుగా (Janhvi Kapoor) జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్నారు. అయితే గత కొంతకాలంగా శ్రీదేవి మరణం గురించి జాన్వి కపూర్ గురించి కూడా ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై ఈయన రియాక్ట్ అవుతూ క్లారిటీ ఇచ్చారు. నా రెండో వివాహం శ్రీతో 1996 మే 2వ తేదీన షిర్డీలో జరిగింది. ఆ తర్వాత ఆ మరుపటి సంవత్సరం జనవరిలో ఆమె గర్భం దాల్చింది. అయితే పెళ్లికి ముందే శ్రీదేవి గర్భవతి అంటూ ఎన్నో రకాల వార్తలను సృష్టించారు.
ఇక జాన్వీ తన కుమార్తె కాదంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలలో ఏ నిజం లేదని, మా పెళ్లి మేలో జరగక జనవరిలో జాన్వీ శ్రీదేవి కడుపున పడింది అంటూ ఈ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు. పెళ్లికి ముందే శ్రీదేవి ప్రెగ్నెంట్ అనే వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఈయన కొట్టి పారేశారు. ఇక శ్రీదేవి మరణం గురించి కూడా ఈయన మాట్లాడుతూ తను బాగా డైట్ ఫాలో కావటం వల్లే కళ్ళు తిరిగి పడిపోయి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ఈయన వెల్లడించారు.
ఇలా శ్రీదేవి మరణం గురించి అలాగే తన కుమార్తె గురించి ఈయన మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మాకు మత విశ్వాలపై పూర్తి నమ్మకం ఉంది. నా కుమార్తె జాన్వి, నేను, మా కుంటుంబ ప్రతి మూడు నెలలకోసారి తిరుపతికి వెళ్లుంటాం. నా భార్య శ్రీదేవి తన ప్రతి పుట్టిన రోజుకు తిరుపతికి వచ్చేది అంటూ ఈయన శ్రీదేవి గురించి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలను ఈ సందర్భంగా వెల్లడించారు.