ఈ ఏడాది సమ్మర్ కానుకగా విడుదలైన తెలుగు సినిమాలలో విరూపాక్ష సినిమా మినహా మరే సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. భారీ అంచనాలతో విడుదలైన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచి నిర్మాతలకు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. గత కొన్నేళ్లలో సమ్మర్ సీజన్ ఇంత డల్ గా ఎప్పుడూ లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. సమ్మర్ సీజన్ లో రిలీజైన సినిమాలలో మెజారిటీ సినిమాలు అంచనాలు అందుకోలేదు.
అయితే రాబోయే రోజుల్లో విడుదల (Box Office) కానున్న ఆదిపురుష్, బ్రో, భోళా శంకర్ సినిమాలు ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జూన్ లో ఆదిపురుష్ జులైలో బ్రో ఆగష్టులో భోళా శంకర్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ మూడు సినిమాలు వేర్వేరు జానర్లలో తెరకెక్కుతుండటం గమనార్హం. ఆదిపురుష్ మూవీ మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా జూన్ నెలలో ఈ సినిమా విడుదల కానుంది. 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు 700 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరగగా సినిమా రిలీజ్ సమయానికి ఆ అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని మేకర్స్ భావిస్తున్నారు. ఆదిపురుష్ ట్రైలర్, జై శ్రీరామ్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయనే సంగతి తెలిసిందే. బ్రో మూవీ నుంచి రిలీజైన పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అటు పవన్ కళ్యాణ్ పోస్టర్ కు, ఇటు సాయితేజ్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే.
జులై 28వ తేదీ కోసం పవన్, సాయితేజ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విరూపాక్ష తర్వాత సాయితేజ్ భీమ్లా నాయక్ తర్వాత పవన్ నటించి విడుదలవుతున్న సినిమాలు ఇవే కావడం గమనార్హం. మరోవైపు భోళా శంకర్ మూవీపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. ఆగష్టు నెల రెండో వారంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ కు ఊపిరి పోస్తాయో లేదో చూడాల్సి ఉంది.