ఆ నలుగురిలో ఎవరు గెలిచారు..?

  • October 23, 2022 / 11:20 PM IST

ఈ దీపావళికి మొత్తం నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉంటుందని అందరూ భావించారు. కానీ ఈ నాలుగు సినిమాల్లో ఒక్క సినిమానే వర్కవుట్ అయిందని టాక్. కార్తి నటించిన ‘సర్ధార్’, విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’, శివ కార్తికేయ ‘ప్రిన్స్’, మంచు విష్ణు ‘జిన్నా’ సినిమాలు పోటీ పడగా.. ‘సర్దార్’ ఒక్కటే పై చేయి సాధించింది.

మిగిలిన సినిమాలతో పోలిస్తే.. ‘సర్దార్’కి మంచి రివ్యూలతో పాటు డీసెంట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి. రెండో రోజు కలెక్షన్స్ మరింత పెరిగాయి. ‘ఓరి దేవుడా’ సినిమాకి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. మౌత్ టాక్ తో కలెక్షన్స్ పెరుగుతాయని నిర్మాతలు ఆశిస్తున్నారు. యూత్ ను టార్గెట్ చేసుకొని తెరకెక్కించిన సినిమా ఇది. రివ్యూలు అయితే పాజిటివ్ గా వచ్చాయి. క్లీన్ ఎంటర్టైనర్ అయినప్పటికీ.. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా రీచ్ అవ్వలేదు.

ఇక ‘ప్రిన్స్’ సినిమాపై తమిళ సినిమా అనే ముద్ర పడిపోయింది. అనుదీప్ స్టైల్ లో కామెడీ ఉన్నప్పటికీ.. ‘జాతిరత్నాలు’ సినిమాను గుర్తుచేయడం ఒక మైనస్ అయింది. తమిళ వెర్షన్ తెలుగుకంటే వీక్ గా ఉందని సమాచారం. మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమాపై రొటీన్ ముద్ర పడిపోయింది. రొటీన్ మాస్ మసాలా సినిమాకి హారర్ ఎలిమెంట్స్ జోడించారే తప్ప.. కొత్తదనం లేదని అంటున్నారు.

అలా చూసుకుంటే ఈ నాలుగు సినిమాల్లో ‘సర్దార్’ రేసులో ముందుందని తెలుస్తోంది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి. ఈ సినిమాల సంగతి పక్కన పెడితే.. గత వారంలో విడుదలైన ‘కాంతారా’ ఇప్పటికీ సత్తా చాటుతోంది. కొత్త సినిమాల రిలీజ్ కారణంగా ఈ సినిమాకి థియేటర్లు తగ్గించారు. అయినప్పటికీ.. జనాలు థియేటర్లు వెతుక్కొని మరీ ఈ సినిమా చూస్తున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus