Boyapati Srinu, Mahesh Babu: మహేష్ బాబు బోయపాటి కాంబినేషన్ మూవీ అలా ఉండనుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్రేజీ కాంబినేషన్లలో మహేష్ బాబు బోయపాటి శ్రీను కాంబినేషన్ ఒకటి కాగా ఈ కాంబినేషన్ లో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. బోయపాటి శ్రీను తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబుతో కమర్షియల్ సినిమా చేయాలని ఉందని బోయపాటి శ్రీను అన్నారు.
మహేష్ బాబు ఏదైనా చేయగలరని బోయపాటి శ్రీను అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

మహేష్ బాబు ఆల్ రౌండర్ అని మహేష్ బాబు గురించి చెప్పాలంటే క్లాస్, మాస్, ఫ్యామిలీ అనే తేడా లేదని బోయపాటి శ్రీను చెప్పుకొచ్చారు. మహేష్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉండగా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. మహేష్ బాబుతో తప్పకుండా సినిమా చేస్తానని గతంలో మహేష్ కు కథ చెప్పడం జరిగిందని బోయపాటి శ్రీను కామెంట్లు చేశారు.

సమయం కుదరకపోవడం వల్లే సినిమా రాలేదని అంతకు మంచి మరే రీజన్ లేదని బోయపాటి శ్రీను అభిప్రాయం వ్యక్తం చేశారు. బోయపాటి శ్రీను తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బోయపాటి శ్రీను తర్వాత సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. స్కంద సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని బోయపాటి శ్రీను స్కంద సినిమా క్లైమాక్స్ ద్వారా వెల్లడించగా ఈ సినిమాకు సీక్వెల్ నిజంగానే తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

బోయపాటి శ్రీను (Boyapati Srinu) సినిమాలన్నీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. బోయపాటి శ్రీను రాబోయే రోజుల్లో భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. బోయపాటి శ్రీనును అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ పర్ఫెక్ట్ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు వస్తాయేమో చూడాల్సి ఉంది.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus