నటి భౌతిక కాయం పై పడి ఏడ్చిన ప్రియుడు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫోటో..!

  • November 23, 2022 / 09:45 PM IST

ఓ నటి జీవితం మొగ్గలోనే రాలిపోయింది. 24 ఏళ్ళ వయసులోనే ఆమె బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించింది. ఎవరిగురించి చెబుతున్నానో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఆమెనే బెంగాలీ నటి ఆండ్రిలా శర్మ . బ్రెయిన్ స్ట్రోక్ తో నవంబర్ 1 న కోల్ కత్తాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆండ్రిలా చేరడం జరిగింది. అంతేకాకుండా ఆమెకు పలుమార్లు గుండెపోటు కూడా రావడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్టు వైద్యులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

గతంలో ఆండ్రిలా క్యాన్సర్ ను కూడా జయించిన సంగతి తెలిసిందే. ఈమెను బ్రతికించుకోవాలి అని ఆమె బాయ్‌ఫ్రెండ్ సబ్యసాచి చౌదరి చాలా ప్రయత్నాలు చేశాడు. ఆమె కోసం ప్రార్థించమని సోషల్ మీడియాలో కూడా అభిమానులను వేడుకున్నాడు .కానీ లాభం లేకుండా పోయింది.దీంతో అతను మానసికంగా కృంగిపోయాడు. ఆండ్రిలా అంత్యక్రియల్లో అతను బాధను తట్టుకోలేక ఆమె పాదాలను ముద్దు పెట్టుకుని మరీ ఏడ్చేశాడు. ఈ దృశ్యం అక్కడున్న వారిని కన్నీరు పెట్టించింది అని చెప్పాలి.

అలాగే సబ్యసాచి తన సోషల్ మీడియా ఖాతాని కూడా డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. దీనిని బట్టి అతను ఆండ్రిలాని ప్రాణంగా ప్రేమించాడు అని స్పష్టమవుతుంది. జుమూర్‌తో అనే సీరియల్ ద్వారా నటిగా మారిన ఆండ్రిలా… అమీ దీదీ నంబర్ 1, లవ్ కేఫ్ వంటి సినిమాల్లో నటించింది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus