కరోనా మహమ్మారి వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మించిన నిర్మాతలకు కరోనా వల్ల రిలీజ్ డేట్లు వాయిదా పడుతుండటంతో నిర్మాతలపై భారం పెరుగుతోంది. గత కొన్ని నెలల నుంచి వరుసగా సినిమాలు విడుదలవుతుండగా ఏపీలో తగ్గించిన టికెట్ రేట్లు నిర్మాతలకు తలనొప్పిగా మారాయి. హీరో నాని ఏపీలో టికెట్ రేట్ల గురించి ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
నాని వ్యాఖ్యలకు కొంతమంది మద్దతు ప్రకటిస్తుంటే మరికొందరు మాత్రం నాని కామెంట్లపై విమర్శలు చేస్తున్నారు. ఏపీలో టికెట్ ధరల వివాదం, థియేటర్లపై కొనసాగుతున్న దాడుల విషయంలో ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బ్రహ్మాజీ ఏపీ సీఎం జగన్ గురించి ఒక ట్వీట్ చేయగా ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. జగన్ సార్.. అందరికీ వరాలు ఇస్తున్నారు.. పాపం థియేటర్ల ఓనర్లకు, సినిమావాళ్లకు హెల్ప్ చేయండని బ్రహ్మాజీ పేర్కొన్నారు. ఇట్లు వైఎస్సార్ అభిమానిని అంటూ బ్రహ్మాజీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
బ్రహ్మాజీ ట్వీట్ గురించి ఏపీ ప్రభుత్వ పెద్దలు స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. ఏపీలో పదుల సంఖ్యలో థియేటర్లు మూతబడుతుండటంతో నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు కోర్టులో టికెట్ రేట్ల వివాదం కొనసాగుతోంది. త్వరలో కోర్టు నుంచి ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడనుంది. మరోవైపు అధికారులు నిబంధనలు పాటించని థియేటర్లను సీజ్ చేస్తున్నారు. ఏపీలో తగ్గించిన టికెట్ రేట్ల వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లుతోంది. ఇప్పట్లో థియేటర్లకు పూర్వ వైభవం రావడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇండస్ట్రీ పెద్దలు ఏపీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటే మంచిదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. టికెట్ రేట్ల తగ్గింపు వల్ల హిట్ టాక్ వచ్చిన సినిమాలకు సైతం ఏపీలో నష్టాలు తప్పడం లేదు. అన్ని ఏరియాల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిన అఖండ ఏపీలోని పలు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదని బోగట్టా.
@ysjagan Sirr.. andhariki varalu isthunnaru.. papam theatre owners ki.. cinema vaallaki help cheyyandi.. itlu Mee nanna gari abhimaani 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 https://t.co/wUV2yGzHUG