ఓ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన వాళ్లకు పేరొస్తుంది అంటారు. లేదంటే అందులో హీరోయిన్‌కి పేరొస్తుంది అని చెప్పొచ్చు. ఇదంతా నటుల విషయంలో మాత్రమే. అయితే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కి పేరొచ్చింది అంటే.. అతను అందరినీ డామినేట్ చేసి ఉండాలి. ఇప్పుడు ‘రంగమార్తాండ’ సినిమాలో అలాంటి రెస్పాన్స్ అందుకుంటున్న నటుడు బ్రహ్మానందం. ఈ సినిమా ప్రీమియర్లు చూసిన ఫ్యాన్స్, సెలబ్రిటీలు బ్రహ్మానందాన్ని తెగ మెచ్చుకుంటున్నారు. అంటే ఆయన అద్భుతమైన కామెడీ చేశారు అని కాదు.. ఇప్పటివరకు బ్రహ్మాని అలాంటి పాత్రలో చూడలేదని.
అలాంటి బ్రహ్మానందం సినిమాలో తన పాత్ర గురించి, సినిమా షూటింగ్ టైమ్‌లో జరిగిన విషయాల గురించి చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రెస్‌మీట్‌లో బ్రహ్మానందం మాట్లాడారు. ఈ క్రమంలో తాను చనిపోయేవరకూ కమెడియన్‌గానే అలరిస్తుంటానని మాటిచ్చారు బ్రహ్మానందం. అంతేకాదు కామెడీ బ్రాండెడ్ బ్రహ్మానందంగా ఉండడానికే తాను ఇష్టపడతానని తెలిపారు.
కృష్ణవంశీ, ప్రకాశ్‌రాజ్ ఓ రోజు మా ఇంటికి వచ్చారు. జాతీయ అవార్డు అందుకున్న ఇద్దరు వ్యక్తులు వచ్చి నాకు ఒక పాత్ర గురించి చెబుతున్నారంటే నేను షాకయ్యా. ఇదొక అరుదైన అవకాశమని ఫీలయ్యా అంటూ సినిమాలోకి తాను వచ్చిన రోజు గురించి చెప్పారు బ్రహ్మానందం. అలాగే ప్రకాశ్‌రాజ్ ఫోన్ చేసి తనతో చెప్పిన మాటల్ని కూడా గుర్తు చేసుకున్నారు. ‘అన్నయ్యా.. ఈ రోజు మీరు బాగా నటించారు. మిమ్మల్ని ఇప్పుడు అభినందించకపోతే కళామతల్లికి ద్రోహం చేసినట్లే’ అని అన్నాడు అని చెప్పారు బ్రహ్మానందం.
ఒక రోజు భోజనం తినే సమయం ఇవ్వకుండా ఒక పెద్ద సీన్ సింగిల్ టేక్‌లో చేయాలని కృష్ణవంశీ అడిగాడు. ‘బ్రహ్మానందానికి ఈ పాత్ర ఇచ్చి కృష్ణవంశీ చెడగొట్టాడు’ అని జనం అంటారేమోనని ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమా చేశా అని సెట్స్‌లో జరిగిన సంఘటనల గురించి చెప్పారు. అంతేకాదు ఇలాంటివి మరిన్ని ఘటనలు జరిగాయని బ్రహ్మానందం వివరించారు.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?