Brahmastra: వంద రూపాయలకే ‘బ్రహ్మాస్త్ర’ సినిమా టికెట్స్!

‘బ్రహ్మాస్త్ర’ సినిమాకి వచ్చిన టాక్ బట్టి అయితే ఆ సినిమా ఇంకా థియేటర్లలో ఉండకూడదు. తొలి వారంలోనే థియేట్రికల్ రన్ ముగిసిపోవాలి. కానీ టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. మెల్లగా సినిమా జోరు తగ్గింది. వీక్ డేస్ లో వసూళ్లు పడిపోయాయి. అయితే ఈ నెల 23న నేషనల్ సినిమా డేను పురస్కరించుకొని నార్త్ అంతటా సినిమాల టికెట్ రేటు 75 రూపాయలు పెట్టారు.

ఈ అవకాశాన్ని ‘బ్రహ్మాస్త్ర’ వినియోగించుకుంది. త్రీడీలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ఉన్న ఈ సినిమాను చూడడానికి జనాలు ఎగబడ్డారు. దానికి తగ్గట్లే సినిమా టికెట్లు తెగాయి. ఇది చూసిన డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు కొత్త స్ట్రాటజీ వేశారు. మరో ప్లాన్ తో రంగంలోకి దిగారు. తక్కువ రేట్ ఉంటే సినిమా చూడడానికి ఎక్కువ మంది వస్తారనే విషయాన్ని గుర్తించి సోమవారం నుంచి గురువారం వరకు టికెట్ రేటుని రూ.100కి ఫిక్స్ చేశారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా దసరా సెలవులు నడుస్తున్నాయి. ఇప్పుడు వీక్ డేస్ లో కూడా థియేటర్లు వచ్చే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. పైగా ‘బ్రహ్మాస్త్ర’కు పోటీగా మరో సినిమా లేదు. అందుకే తక్కువ రేటు పెట్టి మరిన్ని కలెక్షన్స్ వసూలు చేసుకునే పనిలో పడ్డారు డిస్ట్రిబ్యూటర్లు. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ అనే తేడా లేకుండా ఈ రేటు అమలు చేస్తుండడంతో ప్లాన్ బాగానే వర్కవుట్ అయ్యేలా ఉంది.

‘బ్రహ్మాస్త్ర’ విషయంలో ఈ ప్లాన్ సక్సెస్ అయితే.. ఫ్యూచర్ లో కూడా ఇలా రేట్లు తగ్గించి ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టే ప్రణాళికలు కొనసాగే ఛాన్స్ ఉంది. రణబీర్, అలియా జంటగా నటించిన ఈ సినిమాను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను మూడు భాగాలుగా తీయాలనేది దర్శకుడి ప్లాన్. సెకండ్ పార్ట్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి!

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus