మొదట తిరుపతిలో చేద్దామనుకొన్నారు. ఆ తర్వాత శిల్పకళా వేదిక అన్నారు. ఇప్పుడు అక్కడి నుంచి జె.ఆర్.సి కి మారింది. ఓ అగ్ర కథానాయకుడి సినిమా ఆడియో వేడుకకు ఏమాత్రం సెట్ అవ్వని జె.ఆర్.సి లాంటి ఒక చిన్న వెన్యూలో “బ్రహ్మోత్సవం” లాంటి భారీ బడ్జెట్ సినిమా ఆడియో వేడుకను నిర్వహించాల్సిన పరిస్తితి ఎందుకు వచ్చిందో అర్ధం కాక అయోమయ స్థితిలో ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ అభిమానులు.
“శ్రీమంతుడు” లాంటి సూపర్ సక్సెస్ తర్వాత మహేష్ బాబు నటించిన సినిమా కావడం.. మహేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కూడా కావడంతో “బ్రహ్మోత్సవం” సినిమాపై చాలా ఆశలు పెట్టుకొన్నారు. కానీ.. ఇలా సినిమాకి అత్యంత ముఖ్యమైన “ఆడియో వేడుక”ను అభిమానులందరూ పాల్గొనడానికి ఏమాత్రం వీలుకాని జె.ఆర్.సిలో నిర్వహించడంలో దర్శకనిర్మాతల ఆంతర్యం ఏమీటో వారికే తెలియాలి!