Bro Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న బ్రో.. రన్ టైం ఎంతంటే?

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో రూపొందిన బ్రో సినిమా జూలై 28 న విడుదల కాబోతుంది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకుడు కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ .. కథ, స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో టైంకి రూపమంటూ ఉంటే ఎలా ఉంటుందో అలా కనిపించబోతున్నాడు. టీజర్, ట్రైలర్లు బాగున్నాయి. పాటలు సో సోగా ఉన్నాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.

ఆల్రెడీ ప్రీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. జూలై 25 న శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు హాజరవుతారు. ఇక ‘బ్రో’ మూవీ సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రం రన్ టైం 2 గంటల 14 నిమిషాలు అంటే 134.30 నిమిషాలు ఉంటుందట. ఇక ‘బ్రో’ కి ఎటువంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ను జారీ చేసింది సెన్సార్ యూనిట్.

అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని (Bro Movie) వీక్షించవచ్చు అనమాట. రన్ టైం కూడా సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.మల్టీప్లెక్సుల్లో ఎక్కువ షోలు వేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయట. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి అభిమానులకి ఈ సినిమా మంచి ఫీస్ట్ లా ఉంటుందట.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus