టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై హిట్టు , ప్లాప్ అనేది ఏమాత్రం ప్రభావం చూపదు, హిట్స్ లో ఉన్నప్పటి కంటే క్కువగా , ఆయనకి ఫ్లాప్స్ లో ఉన్నప్పుడే క్రేజ్ పెరుగుతూ ఉంటుంది. ఏ స్టార్ హీరో కి కూడా ఇండియా లో ఇలాంటి అదృష్టం దక్కలేదు , ఒక్క పవర్ స్టార్ కి తప్ప. రీసెంట్ గా విడుదలైన ‘బ్రో ది అవతార్’ చిత్రం అందుకు ఒక ఉదాహరణ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకునే ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు, థియేటర్స్ లో చూడదగ్గ సినిమా కూడా కాదు.
అలాంటి సినిమాకి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఒక సినిమాకి మంచి టాక్ వస్తే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకొని మరీ ఆరాధిస్తున్నారు కానీ, ఫ్లాప్ టాక్ వచ్చినప్పుడు మాత్రం కనీసం థియేటర్స్ ముఖం వైపు కూడా చూడడం లేదు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా నిలబడడం చాలా కష్టం. అలాంటిది ఒక ఆఫ్ బీట్ సినిమాకి, కేవలం ముఖ్య పాత్ర పోషించి, డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఇంకా థియేటర్స్ లో నిలపగలిగాడంటే పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్ ఎలాంటిదో మరొక్కసారి అందరూ అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే ఓవర్సీస్ లో ఈ చిత్రానికి సరిగా షోస్ కేటాయించలేదు. ప్రీమియర్స్ నుండే భారీగా షోస్ విషయం లో జాప్యం చేశారు. కొన్ని లొకేషన్స్ లో సినిమా విడుదల కూడా కాలేదు. అయ్యినప్పటికీ ఈ చిత్రానికి ఆ ప్రాంతం లో 18 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు, రీమేక్ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో అయితే చూసారు కానీ , ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ చూడడం ఆడియన్స్ చూడరు.
అలాంటి ప్రాంతం లో కూడా ఈ చిత్రానికి ఈ స్థాయి వసూళ్లు రావడం ట్రేడ్ పండితులకు సైతం పెద్ద షాక్. దీనికే ఇలా ఉంటే రేపు రాబొయ్యే పవన్ కళ్యాణ్ భారీ బడ్జెట్ సినిమాలకు ఇక ఏ స్థాయి వసూళ్లు వస్తాయో అని ఇప్పటి నుండే లెక్కలు వేసుకుంటున్నారు అభిమానులు.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!