తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సీతమ్’ చిత్రం తెలుగులో ‘బ్రో’ గా రీమేక్ అయిన సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ జంటగా నటించిన ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో ప్రధాన పాత్ర పోషించారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన సముద్రఖని ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేశారు.
‘బ్రో’ పాటలకి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు కానీ టీజర్, ట్రైలర్లకి మాత్రం సూపర్ రెస్పాన్స్ లభించింది. జూలై 28 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలకి షో వేసినట్లు సమాచారం. వారి టాక్ ప్రకారం.. మార్కండేయ అలియాస్ మార్క్ (సాయి ధరమ్ తేజ్) తన తండ్రి అకాల మరణంతో తమ కంపెనీకి సంబంధించిన కీలక బాధ్యతలు చేపడతాడు. అనుక్షణం తన కంపెనీ కోసమే పనిచేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన ఫ్యామిలీకి సరిగ్గా టైం కేటాయించడు. ప్రేయసితో కూడా మాటల యుద్ధం చోటుచేసుకుంటుంది. బ్రేకప్ చెప్పే వరకు వెళ్తుంది పరిస్థితి. ఇలాంటి టైంలో అతనికి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది.
అందులో అతను మరణిస్తాడు. అప్పుడు అతనికి కుటుంబ బాధ్యతలు గుర్తొస్తాయి. తన తల్లి, సోదరి, సోదరుడు.. ఏమైపోతారో అని అప్పుడు అతనికి గుర్తొస్తుంది. దీంతో అతనికి దర్శనమిచ్చిన టైం(పవన్ కళ్యాణ్) ను కొంత కాలం గడువు ఇస్తే.. తనకి ప్రమోషన్ వస్తుందని, తన సోదరికి వివాహం చేసి వస్తాను అని చెబుతాడు. అందుకు టైం కూడా ఒప్పుకుని అతనికి మరింత కాలం జీవించే అవకాశం కల్పిస్తాడు.ఇందుకు నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను అనే కండిషన్ కూడా పెడతాడు. అయితే తిరిగి మార్క్ బ్రతికి తన ఇంటికి వెళ్తే ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. తన సోదరి, సోదరుడు తమ కెరీర్ ను ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. తర్వాత ఏమైంది అనేది మిగిలిన కథగా తెలుస్తుంది.
ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ పోర్షన్ కొంత బోర్ కొట్టే విధంగా ఉందని.. అయితే పవన్ కళ్యాణ్ ఎంట్రీతో అందరిలో ఉత్సాహం వస్తుందని. సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని తెలుస్తుంది. వివిధ గెటప్లలో పవన్ కళ్యాణ్ కనిపిస్తూ..తన అభిమానులకి నోస్టాల్జిక్ ఫీల్ ను కలిగిస్తాడని సమాచారం. ఓవరాల్ గా కర్మ సిద్ధాంతం అనే మంచి కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందిందని.. క్లైమాక్స్ ను ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఇక్కడ డిజైన్ చేసినట్లు స్పష్టమవుతుంది. మొత్తంగా ఈ సినిమా యావరేజ్ టు ఎబౌవ్ యావరేజ్ అనే విధంగా ఉంటుందని.. పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా అని అభిమానులు ఎక్కువ అంచనాలు పెట్టుకుని సినిమాకి వెళ్తే నిరాశే ఎదురవుతుందని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. మరి బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.
ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!