మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. నేడు (జూలై 28న) థియేటర్లలో పవన్ కళ్యాణ్, మెగామేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే పండుగలా ఫీల్ అవుతున్న మెగా అభిమానులకు కొన్ని చోట్ల మాత్రం నిరాశ ఎదురైంది. తెలుగు రాష్ట్రాల్లో బ్రో సందడి మామూలుగా లేదు. పవన్ ఫ్యాన్స్ అయితే తెగ సందడి చేసేస్తున్నారు. అయితే తాజాగా బ్రో చిత్రం ప్రదర్శితమవుతున్న శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలోని శ్రీదేవి థియేటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
శ్రీదేవి థియేటర్లో సౌండ్ సిస్టం ఐసీలు ఫెయిల్ అవ్వడంతో యాజమాన్యం షోను నిలుపుదల చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ థియేటర్ వద్ద ఆందోళనకు దిగారు. థియేటర్ యాజమాన్యానికి పవన్ అభిమానులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. థియేటర్ వద్దకు చేరుకొని పోలీసులు పరిస్థితిని అదుపు చేస్తున్నారు. మరోవైపు గూడూరు పట్టణం సంగం సినిమా థియేటర్ లో బ్రో సినిమా ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. సినిమా రిలీజ్ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్యాన్స్ కు యాజమాన్యానికి మధ్య వివాదం తలెత్తింది.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తడంతో మధ్యలో కల్పించుకున్న థియేటర్ యాజమాన్యం ఫ్లెక్సీలను చించివేసింది. దీంతో ఏకమైన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మూకుమ్మడిగా ఆందోళన వ్యక్తం చేయడంతో తిరిగి థియేటర్ యాజమాన్యం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. అయితే అనేక చోట్ల బ్రో బెనిఫిట్ షో అగిపోవడం వలన ఫ్యాన్స్ ఇది రాజకీయంగా చూస్తున్నారు..
ప్రభుత్వం కావాలని కొన్ని చోట్ల నిలిపివేసిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలి.. ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన భ్రో సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఫస్ట్ షో నుంచి హిట్ టాక్ తెచ్చుకుందని అంటున్నారు. (Bro Movie) బ్రో సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
‘బ్రో’ మూవీ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు..!
‘బ్రో’ కి మిక్స్డ్ టాక్ రావడానికి కారణం ఈ 10 మైనస్సులేనట!