శ్రీవిష్ణు,నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో సత్య దేవ్, నివేదా పేతురేజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వంటి వారు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘మన్యం ప్రొడక్షన్స్’ బ్యానర్ పై విజయ్ కుమార్ మన్యం నిర్మించారు. ఎటువంటి అంచనాలు లేకుండా 2019 వ సంవత్సరం జూన్ 28న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. నేటితో ఈ చిత్రం విడుదలై రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో నెటిజన్లు ‘#2YearsForBrochevarevarura’ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు.
మరి ఈ చిత్రం ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసింది అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 2.29 cr |
సీడెడ్ | 0.63 cr |
ఉత్తరాంధ్ర | 0.69 cr |
ఈస్ట్ | 0.41 cr |
వెస్ట్ | 0.31 cr |
గుంటూరు | 0.43 cr |
కృష్ణా | 0.32 cr |
నెల్లూరు | 0.33 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 5.41 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.91 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 6.32 cr |
‘బ్రోచేవారెవరురా’ చిత్రానికి రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.6.32 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే రూ.4.12 కోట్ల లాభాలను బయ్యర్లకు అందించిందన్న మాట.
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!