‘క్షణం’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి డీసెంట్ సక్సెస్ లతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు రవికాంత్ పేరేపు. కొంత గ్యాప్ తర్వాత అతను సుమ కొడుకు రోషన్ కనకాలని హీరోగా పెట్టి ‘బబుల్‌గమ్’ అనే సినిమాని రూపొందించాడు. డిసెంబర్ 29 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మానస చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థతో కలిసి ‘మహేశ్వరి మూవీస్’ సంస్థ నిర్మించింది.
ఈ సినిమా టీజర్, ట్రైలర్స్, పాటలు వంటివి బాగానే ఉన్నాయి. కానీ పోటీగా ‘డెవిల్’ వంటి సినిమా రిలీజ్ అవుతూ ఉండటం అలాగే ప్రభాస్ ‘సలార్’ కూడా సూపర్ ఫామ్లో ఉండటంతో ‘బబుల్ గమ్’ ఎంత వరకు నిలబడుతుంది అనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది. అయితే దర్శకుడు రవికాంత్ పేరెపు మాత్రం కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ‘ ‘సలార్’ సినిమాలో లేనిది మా సినిమా ఉంది .. కాబట్టి మాకు భయం లేదు’ అంటున్నాడు.
సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘బబుల్ గమ్’ సినిమాకి చాలా చోట్ల పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. కొంతమంది ఇండస్ట్రీ పెద్దలకి అయితే ఆల్రెడీ స్పెషల్ షోలు వేయడం జరిగింది. వాళ్ళు ఈ సినిమాకు పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఫన్నీ ఫన్నీగా బాగానే అనిపిస్తుందట. కానీ సెకండ్ హాఫ్ మళ్ళీ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ టైపులో ఉంటుందట.
అది ఆడియన్స్ కి రిపీటెడ్ గా అనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. యూత్ కి ఈ సినిమా కనెక్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయట. కానీ మితిమీరిన లిప్ లాక్ సీన్లు, ఇంటిమేట్ సీన్లు ఉండటం కొంత మైనస్ అని, వాటి వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను (Bubblegum) పక్కన పెట్టే ప్రమాదం ఉందంటున్నారు. చూడాలి మరి