Bullet Bhaskar: ‘భోళా శంకర్‌’లో రష్మీ… స్టేజీ మీద గాలి తీసేసిన భాస్కర్‌

చాలా రోజుల క్రితం ‘జబర్దస్త్‌’లో సుడిగాలి సుధీర్‌ మీద అప్పటి జడ్జి రోజా ఓ జోక్‌ వేశారు. ‘రేసుగుర్రం’ సినిమాలో అతని పాత్ర మెరుపుతీగలాగా వచ్చి వెళ్లిపోతుందని. నిజానికి ఆ పాత్రలో సుధీర్‌ అలానే ఉంటాడు. జస్ట్‌ కాస్త తల పక్కకు తిప్పి మళ్లీ చూస్తే వెళ్లిపోయి ఉంటాడు. రోజా జోక్‌కు అందరూ నవ్వుకున్నారు కూడా. సుధీర్‌ ఎక్కడ కనిపించాడు అనేది ఆఖరున చెబుతాం. ఇప్పుడు ఇదే తరహాలో రష్మి మీద కూడా ఓ జోక్‌ పడింది. అయితే ఈసారి వేసింది కమెడియన్‌ బుల్లెట్‌ భాస్కర్‌.

మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాలో చాలామంది బుల్లితెర నటులు కనిపించారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు, జబర్దస్త్ ఆర్టిస్టులతో సినిమాను ఫుల్‌గా నింపేశారు అని చెప్పొచ్చు. అలా ఈ సినిమాలో యాంకర్‌ కమ్‌ పార్ట్‌ టైమ్‌ యాక్టర్‌ రష్మి గౌతమ్‌ కూడా కనిపించింది. ఓ సీన్‌లో, దానికి కలిపి వచ్చే ఓ పాటలో చిరంజీవితో స్టెప్పులేసింది. అయితే తాజాగా ఓ జబర్దస్త్‌ ఎపిసోడ్‌లో రష్మి మీద భాస్కర్‌ ఓ పంచ్‌ వేశాడు. చూస్తే నవ్వొచ్చేలా ఉన్నా.. ఆ మాటలకు కోపం వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు.

‘భోళా శంకర్‌’ సినిమాలో రష్మీని చూడటానికి అతను వెళ్లినట్లు… ఆమె సన్నివేశం వచ్చేటప్పుడు కింద కర్చీఫ్‌ పడిపోతే అది తీసుకోవడానికి ఇలా తలదించి పైకి చూసేసరికి ఆమె వెళ్లిపోయినట్లు పంచ్‌ వేశాడు. నిజానికి ఆమె సీన్స్‌ ఆ తర్వాత పాటలో కూడా ఉన్నాయి. కాబట్టి ఏదో జోక్‌గా అలా అన్నారు అనుకోవచ్చు. కానీ ఎందుకు అలా అనడం అనేది ఓ ప్రశ్న. ఇక్కడే మనం మరో విషయం కూడా మాట్లాడుకోవాలి. యాంకర్‌గా అనసూయ జబర్దస్త్‌ నుండి రెండో సారి వెళ్లిపోయాక ఓ మాట అంది.

‘కొన్నిసార్లు కొంతమంది వేసిన జోక్‌లు, అన్న మాటలు చాలా ఇబ్బంది పెట్టాయి’ అని ఆమె ఎక్కడో అన్నట్లు వార్తలొచ్చాయి. అలాగే ఈ సినిమాలో శ్రీముఖి కూడా నటించింది. అయితే ఆమెకు కొన్ని ఎక్కువ సన్నివేశాలు ఉన్నాయి అని చెప్పాలి. చూద్దాం (Bullet Bhaskar) భాస్కర్‌ కామెంట్స్‌ ఎపిసోడ్‌ వచ్చాక ఎలా మారుతాయో.

Actress Sonia Deepti Exclusive Interview | Miss Shetty Mr Polishetty, Bigg Boss Telugu 7, MaheshBabu

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus