సుమంత్ (Sumanth) కొంత గ్యాప్ తీసుకుని ఓటీటీ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో చేసిన ‘అహం రీబూట్’ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘అనగనగా’ (Anaganaga) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇదొక మెసేజ్ తో కూడిన ఎమోషనల్ ఫ్యామిలీ మూవీ. సుమంత్ చాలా సటిల్డ్ గా నటించాడు. ఇలాంటి కథలు అతనికి టైలర్ మేడ్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. కొడుకుతో తండ్రికి ఉండే ఎమోషనల్ బాండింగ్ ను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు.
ముఖ్యంగా క్లైమాక్స్ అయితే కన్నీళ్లు పెట్టించేస్తుంది. ఈటీవీ విన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ’90’s – మిడిల్ క్లాస్ బయోపిక్’ (90’s – A Middle-Class Biopic) ‘వీరాంజనేయులు విహార యాత్ర’ (Veeranjaneyulu Viharayathra) వంటి సూపర్ హిట్స్ అందించిన ఈటీవీ విన్… ఇప్పుడు ‘అనగనగా’ తో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకి ఏ రేంజ్ డిమాండ్ ఏర్పడింది అంటే..! కొన్ని థియేటర్స్ లో స్పెషల్ గా షోలు కూడా వేస్తున్నారు. వాటికి చాలా మంచి డిమాండ్ ఏర్పడుతుంది.
జనాలు బాగా వస్తున్నారు. సన్నీ సంజయ్ (Sunny Sanjay) ఈ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇది సూపర్ హిట్ రెస్పాన్స్ రాబట్టుకోవడంతో అతనికి మంచి డిమాండ్ ఏర్పడింది. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్..ల నుండి అడ్వాన్సులు అందుతున్నాయి. ఆల్రెడీ ‘అన్నపూర్ణ స్టూడియోస్’ నుండి ఓ పే చెక్ అందినట్టు తెలుస్తోంది. అలాగే ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత నాగవంశీ (Suryadevara Naga Vamsi ) కూడా సంజయ్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట.