పరిచయ చిత్రమే బ్లాక్ బస్టర్, జనాల్లోకి కూడా బాగా వెళ్లిపోయింది. ఇక తెలుగులో నెక్స్ట్ స్టార్ హీరోయిన్ ఈమే అని ఫిక్స్ అయిపోయారు చాలా మంది. కానీ.. ఆ తర్వాత తెలుగులో కనీస స్థాయి విజయం కూడా దక్కించుకోలేక కనుమరుగైపోయింది షాలినీ పాండే (Shalini Pandey) . అసలు ఆ సినిమా విడుదలైనప్పుడు యూత్ అంతా ఆమెను “నా పిల్ల బే” అని ఓన్ చేసుకున్న తీరుకు అప్పటి స్టార్ హీరోయిన్లు కూడా కాస్త కంగారుపడ్డారు.
కట్ చేస్తే.. బాలీవుడ్ అవకాశం కోసమని తెలుగు సినిమాలను పక్కన పెట్టింది. కళ్యాణ్ రామ్ తో (Nandamuri Kalyan Ram) కలిసి నటించిన “118” (118 Movie) ఫ్లాప్ అవ్వడంతో ఆమెకు మంచి ఆఫర్లు కూడా రాలేదు. భారీ ఆశలు పెట్టుకున్న రణవీర్ సింగ్ (Ranaveer Singh) సినిమా ఏమో డిజాస్టర్ అయ్యేసరికి హిందీలోనూ ఆమెకు సరైన ఆఫర్లు రాలేదు. మొన్నామధ్య నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన “మహారాజా” అనే హిందీ సినిమాలో మెరిసిన ఆమెను చూసి చాలా మంది “అయ్యో ఇలాంటి టాలెంటెడ్ అమ్మాయికి తెలుగులో “అర్జున్ రెడ్డి” (Arjun Reddy) తర్వాత మంచి సినిమా పడలేదే” అనుకున్నారు.
ఇన్నాళ్లకు షాలిని పాండేకి సౌత్ నుంచి పిలుపు వచ్చింది. ధనుష్ (Dhanush) హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్న “ఇడ్లీ కడాయ్” అనే సినిమాలో నిత్య మీనన్ (Nithya Menen) హీరోయిన్ గా నటిస్తుండగా, మరో హీరోయిన్ గా షాలిని పాండేను ఫైనల్ చేశాడట ధనుష్. ఈ తమిళ సినిమాతో షాలిని పాండే మళ్లీ సౌత్ లో జెండా పాతుతుందేమో చూడాలి.
ఎందుకంటే.. నటిగా ఆమెకు పేరు పెట్టాల్సిన పని లేదు. చాలా అద్భుతంగా నటిస్తుంది. ఆమె టాలెంట్ కు తగ్గ అవకాశాలు వస్తే కచ్చితంగా తనను తాను ప్రూవ్ చేసుకోగల నటి షాలిని పాండే. ధనుష్ దర్శకత్వం అంటే మినిమం గ్యారెంటీ కాబట్టి “ఇడ్లీ కడాయ్” మీద బోలెడు ఆశలు పెట్టుకుంది అమ్మడు.