దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంలోని మొదటి భాగం బాహుబలి ది బిగినింగ్.. ప్రపంచ వ్యాప్తంగా విడుదలై దాదాపు రూ.600 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలోనూ విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.100 కోట్లు వసూలు చేయడంతో.. ఇప్పుడు బాహుబలి రెండవ భాగం బాహుబలి ది కంక్లూషన్ కు హిందీ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది.
ఈ చిత్రాన్ని హిందీ రైట్స్ తాము కొనుగోలు చేస్తామని చెప్పడంతో పాటు.. దాదాపు రూ.150 కోట్లు చెల్లిస్తామని యష్ రాజ్ ఫిల్మ్స్ వారు ముందుకు వచ్చారట. అయితే ఇది ఒక్క బాలీవుడ్ కే పరిమితం కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా హిందీ వర్షన్, డిస్ట్రిబ్యూషన్, శాటిలైట్ హక్కులు ఇలా అన్నీ కలుపుకొని ఇంత పెద్ద మొత్తంలో యష్ రాజ్ వారు కొనుగోలు చేస్తున్నారని వినికిడి. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుండగా..ఎండల తీవ్ర ఎక్కువగా ఉండటం వలన ఏసి, కూలర్ల మధ్య సినిమా షూటింగ్ కొనసాగించలేక ఓ నెల రోజుల పాటు చిత్రబృందానికి సెలవులు ఇచ్చేశాడు జక్కన్న.