నిన్న సాయంత్రం “రోబో 2.0” రిలీజ్ డేట్ గురించి లైకా సంస్థ ఆఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినప్పట్నుంచి బన్నీ వాసు మామూలు హడావుడి చేయడం లేదు. “2.0” రిలీజ్ డేట్ లో క్లారిటీ లేకపోవడం వల్ల ప్రాంతీయ చిత్రాల విడుదల తేదీలు మారుతున్నాయన్న మాట వాస్తవమే. అయితే.. వాతావరణం కాస్త వేడెక్కించడం కోసం డబ్బింగ్ సినిమాలకు అన్నేసి థియేటర్లు ఇచ్చి, తెలుగు సినిమాను తొక్కేస్తున్నారు అని హడావుడి చేయడం మాత్రం సమంజసం కాదు. ఎందుకంటే.. తెలుగు సినిమాలకు ఎక్కువ థియేటర్లు ఇవ్వాలి అని గోల చేస్తున్న బన్నీ వాసు అండ్ గ్యాంగ్ సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న సూర్య తమిళ చిత్రం “గ్యాంగ్” కోసం భారీ స్థాయిలో థియేటర్లను సమీకరించే పనిలో ఉన్నారు.
పవన్ కళ్యాణ్ “అజ్ణాతవాసి”, బాలకృష్ణ “జై సింహా” చిత్రాలు విడుదలవుతున్నప్పటికీ. జనవరి 12న సూర్య నటించిన “గ్యాంగ్” చిత్రాన్ని విడుదల చేయడం కోసం యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ 2, స్టూడియో గ్రీన్ సంస్థలు కలిసి మరీ థియేటర్స్ ను సమీకరిస్తున్నాయి. మరి రోబో విషయంలో వచ్చిన తెలుగు సినిమా ప్రామ్ముఖ్యత, “గ్యాంగ్” సినిమా విషయంలో ఎందుకు చూపడం లేదు అనే విషయం.. ఆ బృంద సభ్యుడు బన్నీ వాసుకే తెలియాలి.