‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ‘ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో రూపొందిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘బుట్ట బొమ్మ’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘కప్పెల’ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రానికి శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 4 న విడుదల కాబోతోంది. టీజర్, ట్రైలర్లు ప్రామిసింగ్ గా ఉన్నాయి.
కానీ సినిమా పై బజ్ అయితే ఏర్పడలేదు. దీంతో చాలా వరకు నిర్మాతలే రెంటల్ పద్దతిలో ఓన్ రిలీజ్ చేసుకుంటున్నట్టు వినికిడి. మరి బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఎంత రాబట్టలో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
0.60 cr
సీడెడ్
0.27 cr
ఆంధ్ర(టోటల్)
0.65 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)
1.52 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
+ ఓవర్సీస్
0.20 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
1.72 cr
‘బుట్టబొమ్మ’ చిత్రం బిజినెస్ వాల్యూ రూ.1.72 కోట్లు. సో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ వస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. చాలా వరకు సినిమా ఓన్ రిలీజ్ కాబట్టి..పాజిటివ్ టాక్ వచ్చి వీకెండ్ నిలబడినా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి ఈ మూవీ ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో..!