విడుదలైన బుట్ట బొమ్మ పోస్టర్.. కాఫీ అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్!

  • December 19, 2022 / 08:03 AM IST

సాధారణంగా సోషల్ మీడియా అభివృద్ధి కాకముందు ఒక సినిమాలోని సన్నివేశాలు, పాటలు, సంగీతం కాపీ చేసి మరొక సినిమాలో కూడా పెట్టేవారు. కానీ సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా అప్పుడే దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతు ఉంటాయి. దీంతో ఇలా వేరొక సినిమాలను కాపీ చేయడానికి దర్శక నిర్మాతల్లో భయం పట్టుకుంది. తాజాగా శౌరి చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన బుట్ట బొమ్మ అనే సినిమా జనవరి 26వ తేదీన విడుదల చేయటానికి సినిమా యూనిట్ రంగం సిద్ధం చేస్తోంది.

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ ఈ సినిమాని నిర్మించాడు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన కప్పేలా అనే సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అర్జున్ దాస్, అనికా సురేంద్రన్, సూర్య వశిష్ట వంటి వారు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ ఫోటోలు, వీడియోలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తూ సినిమా యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది.

 

అయితే ఈ పోస్టర్ చూసిన నేటిజన్లు మాత్రం నాగ వంశీని ఏకీపారేస్తున్నారు. ఆఖరికి పోస్టర్ కూడా కాపీ కొట్టారు అంటూ విమర్శలు చేస్తున్నారు. 2006లో నోలన్ దర్శకత్వంలో వచ్చిన ది ప్రెస్టేజ్ అన్ సినిమా పోస్టర్ ని కాపీ చేసి బుట్ట బొమ్మగా దింపేయడం తో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో నిర్మాత నాగ వంశీని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇలా ట్రోల్ చేయటానికి పోస్టర్ కాపీ కొట్టడమే కాకుండా మరొక బలమైన కారణం కూడా ఉంది.

ఇటీవల విడుదలైన అవతార్ 2 సినిమా విషయంలో నాగ వంశీ నెగిటివ్ కామెంట్స్ చేశారు. సినిమా ఏ మాత్రం బాలేదని .. జేమ్స్ కామెరాన్ సినిమా కాబట్టి చూడాలా అనే విధంగా కామెంట్లు చేశారు. దీంతో నాగావంశీని ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus