తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు సిరివెన్నెల బతికే ఉంటారు : నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌

సిరివెన్నెల సీతారామ‌శాస్త్రితో చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఆయ‌న‌తో ఎన్నో తీపి జ్ఞాప‌కాలున్నాయి. అన్న అని ఎంతో ఆప్యాయంగా పిలిచేవాడు. మా బ్యాన‌ర్‌లో రూపొందించిన సినిమాల్లోని కొన్ని అద్భుత‌మైన పాట‌ల‌కు ఆయ‌న త‌న సాహిత్యంతో ప్రాణం పోశారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కే కాదు.. సాహిత్యానికి ఆయ‌న చేసిన సేవ‌లు మ‌రచిపోలేం. ఆయ‌న త‌న క‌లం ప‌దునుతో తెలుగు సినీ ప్ర‌స్థానంలో త‌న‌దైన ముద్ర వేశారు. ఎంతో మంది యువ ర‌చ‌యిత‌ల‌కు ఆయ‌న రైట‌ర్‌గా స్ఫూర్తినిచ్చారు.

అలాంటి మంచి రైట‌ర్‌, మ‌న‌సున్న వ్య‌క్తి.. నా సోద‌ర స‌మానుడు ఈరోజు లేర‌నే నిజం ఎంతో బాధ‌ను క‌లిగిస్తుంది. ఈరోజు ఆయ‌న మ‌న మ‌ధ్య లేరేమో కానీ తెలుగు సినిమా ఉన్న‌న్ని రోజులు ఆయ‌న బ‌తికే ఉంటారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Share.