Faria Abdullah: జాతిరత్నాలు హీరోయిన్ కు అలాంటి అనుభవం ఎదురైందా?

జాతిరత్నాలు సినిమాతో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఫరియా అబ్దుల్లా ఒకరు. ఈ సినిమాలోని చిట్టి పాత్రకు ఫరియా అబ్దుల్లా పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. లాయర్ పాత్రలో ఫరియా చెప్పిన కామెడీ డైలాగ్స్ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. తాజాగా ఒక సందర్భంలో ఫరియా అబ్దుల్లా తనకు ఎదురైన ఆసక్తికర ఘటన గురించి అభిమానులతో పంచుకున్నారు. ఫరియా అబ్దుల్లా లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమాలో నటించగా నవంబర్ నెల 4వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

ఒకసారి నేను క్యాబ్ లో వెళుతున్న సమయంలో డ్రైవర్ డల్ గా ఉండటంతో డ్రైవర్ ను ఏమైందని అడిగానని ఆ సమయంలో డ్రైవర్ తన చిన్నప్పటి క్రష్ పేరు చిట్టి అని చెబుతూ బాధ పడ్డాడని ఆమె చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నేను నా పేరు కూడా చిట్టి అని డ్రైవర్ తో చెప్పానని ఫరియా తెలిపారు. నా పేరు చిట్టి అని చెప్పిన వెంటనే డ్రైవర్ కారు ఆపి మీ స్కూల్ ఏది అని అడిగాడని ఆ డ్రైవర్ తన చిన్నప్పటి క్రష్ చిట్టి నేను ఒకరే అని అనుకుని అలా అడిగాడని ఫరియా అబ్దుల్లా పేర్కొన్నారు.

ఆ తర్వాత నేను నా అసలు పేరు చెప్పి జాతిరత్నాలు మూవీలో నా పాత్ర పేరు చిట్టి అని చెప్పడంతో డ్రైవర్ కూల్ అయ్యాడని ఫరియా అబ్దుల్లా కామెంట్లు చేశారు. ఫరియా అబ్దుల్లా వరుసగా సినిమాల్లో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా సక్సెస్ సాధిస్తే ఫరియాకు సినిమా ఆఫర్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఫరియా ఒక్కో ప్రాజెక్ట్ కు కోటి రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఫరియా అబ్దుల్లాకు సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫరియా అబ్దుల్లా తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సంచలన విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus