అప్పట్లో తమిళ హీరో సూర్య కు తెలుగులో మంచి క్రేజ్ ఉండేది. ఆ టైములో కనీసం దరిదాపుల్లో కూడా విజయ్ కనిపించేవాడు కాదు. కానీ చాప కింద నీరులా మెల్ల మెల్లగా ఇక్కడ కూడా మంచి మార్కెట్ ను ఏర్పరుచుకున్నాడు విజయ్. సూర్య ‘బందోబస్త్’ చిత్రాన్ని ఇక్కడ 8 కోట్లకు కొంటే.. విజయ్ తాజా చిత్రమైన ‘విజిల్’ ను ఏకంగా 10 కోట్లకు కొన్నారట మన తెలుగు డిస్ట్రిబ్యూటర్స్. అంటే ‘విజిల్’ చిత్రం తెలుగులో బ్రేక్ ఈవెన్ కావాలంటే 10 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.
అయితే ఇది చిన్న టార్గెట్ మాత్రం కాదు. మరి విజయ్ ఆ టార్గెట్ ను చేదించి బ్రేక్ ఈవెన్ సాధించగలడా.. ? అనేది అందరిలోనూ ఆసక్తిని పెంచే అంశం. విజయ్ గత చిత్రాలు ‘అదిరింది’ (మెర్సల్) తెలుగు రాష్ట్రాల్లో 5.5 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ‘సర్కార్’ అయితే 8.8 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. అయితే ఆ సినిమాల డైరెక్టర్లు మురుగదాస్ సినిమాలకు మన తెలుగులో క్రేజ్ ఉంది. అందుకే ‘సర్కార్’ అంత పెద్ద మొత్తంలో కలెక్ట్ చేసింది. అయితే అట్లీ మార్కెట్ అంతంత మాత్రమే.. కాబట్టి ఈసారి విజయ్ టార్గెట్ పెద్దదనే చెప్పాలి . ఇక అక్టోబర్ 25 న ‘విజిల్’ చిత్రం విడుదల కాబోతుంది..!