కోలీవుడ్ హీరో ఆర్య ‘వరుడు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు! అటు తర్వాత ‘నేనే అంబానీ’ ‘ఆట ఆరంభం’ ‘వాడు వీడు’ ‘రాజా రాణి’ వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అతను హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘కెప్టెన్’. సెప్టెంబర్ 8 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐశ్వర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ వంటి వారు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.
శక్తి సౌందర్ రాజన్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘థింక్ స్టూడియోస్ అసోసియేషన్‌తో’ నిర్మాణ సంస్థ ‘ది స్నో పీపుల్’ పతాకంపై ఆర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘శ్రేష్ఠ్ మూవీస్’ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అలాగే హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ మధ్యనే సుధాకర్ రెడ్డి రిలీజ్ చేసిన తమిళ చిత్రం ‘విక్రమ్’ ఘన విజయం సాధించడంతో ‘కెప్టెన్’ పై కూడా బయ్యర్స్ కు నమ్మకం ఏర్పడింది.
అందుకే ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 0.65 cr |
సీడెడ్ | 0.25 cr |
ఉత్తరాంధ్ర | 0.28 cr |
ఈస్ట్ | 0.08 cr |
వెస్ట్ | 0.06 cr |
గుంటూరు | 0.12 cr |
కృష్ణా | 0.10 cr |
నెల్లూరు | 0.07 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.61 cr |
‘కెప్టెన్’ చిత్రానికి రూ.1.61 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. పలు ఏరియాల్లో సుధాకర్ రెడ్డి ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయితే బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.1.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే కష్టమే. ఎందుకంటే సెప్టెంబర్ 9న ‘ఒకే ఒక జీవితం’ ‘బ్రహ్మాస్త్రం’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!