టాలీవుడ్ టాప్ హీరో, అందాల రాకుమారుడు…అందపిల్లలకు హార్ట్‌ఫుల్ హీరో, అభిమానుల గుండె చప్పుడు అయినటువంటి ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పుడు మురుగుదాస్ దర్శకత్వంలో భారీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..అయితే అదే క్రమంలో బ్రహ్మోత్సవం సినిమాతో ప్రిన్స్ చాలా కష్టాలను చవి చూసాడు అనే చెప్పాలి…..అయితే నిర్మాతగా తాను పడిన ఇబ్బందుల నుంచి బయట పడేందుకు ప్రిన్స్ చాలా కష్టాలే పడ్డాడు….ఇదిలా ఉంటే తాజాగా మరో కేస్ ప్రిన్స్ ను తిప్పలు పెడుతుంది….కోర్ట్ రావాలంటు ఇబ్బందుల పలు చేస్తుంది….విషయంలోకి వెళితే…ప్రిన్స్ మహేష్ కరియర్ లో “శ్రీమంతుడు” సినిమా ఎంతటి హిట్ అయ్యిన సినిమానో అందరికీ తెలిసిందే….అయితే అదే క్రమంలో ఈ సినిమా వల్ల ప్రిన్స్ కోర్ట్ కు రావల్సిన అవసరం వచ్చింది.
మ్యాటర్ లోకి వెళితే….శ్రీమంతుడు సినిమా కథ తనదేనని.. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఒక వారపత్రికలో 2012లో తాను రాసిన ‘‘చచ్చేంత ప్రేమ’’ సీరియస్ లో కాపీ చేశారని.. తనకు న్యాయం చేయాలని ఆయన కోర్టును కోరారు. రచయిత చేసిన ఫిర్యాదును పరిశీలించిన నాంపల్లి కోర్టు తాజాగా సినిమా హీరో మహేశ్ బాబుకు..చిత్ర దర్శకుడు కొరటాల శివ..ఏర్నేని నవీన్ లను కోర్టుకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రచయిత చేసిన ప్రైవేటు ఫిర్యాదుతో ఈ ముగ్గురిపై ఐపీసీ 120బీ.. కాపీరైట్ యాక్ట్ లోని సెక్షన్ 63 కింద కోర్టు కేసు నమోదు చేసి.. శ్రీమంతుడు అండ్ కోలను కోర్టుకు హాజరు కావాలని పేర్కొంది. అయితే ఏది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ…మొత్తానికి అయితే ప్రిన్స్ కు ఆ సినిమా తలపోటు తెప్పిస్తుంది అనే చెప్పాలి….
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.