విలక్షణ నటుడు (Bobby Simha) బాబీ సింహా, (Vedika) వేదిక, అనుష్య త్రిపాఠి, (Prema) ప్రేమ, (Indraja) ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే (Makarand Deshpande) వంటి వారు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రజాకార్’. ‘సమర్ వీర్ క్రియేషన్స్’ బ్యానర్‌పై గూడూరు నారాయణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.యాటా సత్యనారాయణ దర్శకుడు. మార్చి 15న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, మరాఠీ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది. వాస్తవానికి చాలా రోజుల క్రితమే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.
తెలంగాణ ఎన్నికలకి ముందే ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ డిలే అవుతూ వచ్చింది. టీజర్, ట్రైలర్స్ చూశాక ఇందులో చాలా సెన్సిటివ్ కంటెంట్ ఉందనే ఫీలింగ్ అందరికీ కలిగింది. 1950 టైంలో రజాకార్ ..లు హైదరాబాద్ ప్రజలను ఎలా పీడించారు అనే పాయింట్ తో ఈ సినిమా రూపొందింది. దీంతో సెన్సార్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయేమో అని అంతా అనుకుంటున్నారు. కానీ అందులో నిజం లేదు అని దర్శకుడు యాటా సత్యనారాయణ స్పందించి క్లారిటీ ఇచ్చారు.
‘నా సినిమాకి (Razakar) సెన్సార్ టీం ఎటువంటి అభ్యంతరాలు ఎదురవ్వలేదు. మొదట రిలీజ్ డేట్ అనుకున్నప్పుడు సినిమా కేవలం 25 శాతమే కంప్లీట్ అయ్యింది. తర్వాత పోస్ట్ పోన్ చేశాం. వి.ఎఫ్.ఎక్స్ సమస్య వచ్చింది. క్వాలిటీ విషయంలో ఎందుకు రాజీ పడాలి అని భావించి టైం తీసుకున్నాం. కొంత వయొలెన్స్ ఎక్కువైంది అని సెన్సార్ టీం చెప్పింది. దానికి సంబంధించిన షాట్స్ మాత్రం డిలీట్ చేశాం. అంతకు మించి సెన్సార్ సమస్యలు ఏమీ నా సినిమాకి రాలేదు’ అంటూ చెప్పుకొచ్చారు యాటా సత్యనారాయణ.