ఇటీవల కాలంలో జనాలు థియేటర్ కి వెళ్లడమే తగ్గించేశారు. ఇలాంటి పరిస్థితుల్లో.. మొదటి రోజు సినిమాకి వెళ్లే కొంత మంది ప్రేక్షకులు టైటిల్స్ పడే దగ్గరనుండి… హీరో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ .. ఇలా అన్నిటినీ తీసి తమ వాట్సాప్ లో స్టేటస్ లు గా, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లలో స్టోరీస్ గా పెడుతున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. జస్ట్ ఆ సినిమా హ్యాష్ ట్యాగ్ కొడితే చాలు చాలా వరకు సినిమా ఇక్కడే చూసేయొచ్చు.
ఫోటోలు తీసి పెట్టుకుంటే అదో పద్ధతి. కానీ మొత్తానికి వీడియోలే తీసి పెట్టేస్తుంటే.. పైరసీ కోసం ప్రత్యేకంగా సైట్స్ ను విజిట్ చేయనవసరం లేదు. అయితే ఇలా స్టేటస్ లు పెట్టే వారికి కేంద్రం పెద్ద షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. పైరసీని అరికట్టేందుకు, సెన్సార్ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా సినిమాటోగ్రఫి సవరణ బిల్ 2023 ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఇకపై సినిమాను చూసే ప్రేక్షకులు..
దాన్ని వీడియో తీసి పైరసీ చేసినా, వాట్సాప్ స్టేటస్ లు పెట్టినా.. వారికి జైలు శిక్ష కన్ఫర్మ్ అని ఆదేశాలు జారీ చేసింది. అలాగే వారికి జరిమానా కూడా ఉంటుంది. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నామని మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. ఇంటర్నెట్ లో అనధికార సినిమా వీడియోలను ప్రసారం కాకుండా నిరోధించడమే ఈ బిల్ యొక్క ముఖ్య ప్రధాన లక్ష్యం అని ఆయన చెప్పుకొచ్చారు.