టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్టుగా ఉన్నటువంటి జనగణమన సినిమాని ఎప్పుడో మహేష్ బాబు హీరోగా చేయాల్సి ఉంది.అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు వాయిదా పడుతూ వస్తుంది. చివరికి ఈ ప్రాజెక్టులో హీరోగా విజయ్ దేవరకొండను ప్రకటిస్తూ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.ఈ క్రమంలోనే ఈ పోస్టర్ చూసిన తర్వాత ఆర్మీ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోందని అర్థమవుతోంది.
ఇకపోతే పూరి జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా పూర్తి అయిన తరువాత విజయ్ దేవరకొండతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సెట్స్ పైకి తీసుకురావాలని భావించారు. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఆయన మాత్రమే కాకుండా మరి కొందరు ఇన్వెస్టర్ల తో కలిసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
వీరి సూచనల మేరకు పూరీ జగన్నాథ్ ఈ సినిమా కథను కేంద్ర డిజైన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ను కలిసి కథ వివరించి ఈ సినిమాకు అనుమతి కావాలని కోరారు. ముంబై మహానగరాన్ని మిలిటరీ ఫోర్సులు చుట్టుముట్టే కథ కావడంతో భారతదేశ ప్రభుత్వం, డిఫెన్స్ రెండు కూడా ఈ కథను సినిమాగా చేయడానికి అనుమతించలేదు. దీంతో ఒక్కసారిగా పూరిజగన్నాథ్ షాక్ అయ్యారు.
ఎన్నో సంవత్సరాలు తరువాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తున్న క్రమంలో కేంద్రం ఇలా అడ్డుకోవడంతో షాక్ తిన్న పూరీజగన్నాథ్ జనగణమన కథను ఎలాంటి లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా తయారు చేసే పనిలో ఉన్నారట.ఇక ఈ కథ ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఎప్పుడైతే పూర్తి అవుతుందో ఆ క్షణమే ఈ సినిమా తిరిగి సెట్స్ పైకి వెళుతుందని తెలుస్తుంది.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!