శ్రీకాంత్ పెద్ద కుమారుడు రోషన్ మేక .. పెళ్ళిసందD తో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమాకి మంచి టాక్ రాలేదు. కానీ హీరోయిన్ శ్రీలీల గ్లామర్ , కీరవాణి సంగీతం, రోషన్ పెర్ఫార్మెన్స్, లుక్స్ కి మంచి మార్కులే పడ్డాయి. అందువల్ల వెంటనే సినిమాలు సైన్ చేయకుండా మంచి కథల కోసం ఎదురుచూశాడు. టైం పట్టినా పర్వాలేదు కానీ నేటి యువతను ఆకట్టుకునే కథ కోసం టైమ్ తీసుకుని ఛాంపియన్ చేశాడు. వైజయంతి మూవీస్ వంటి పెద్ద బ్యానర్ నుండీ వస్తున్న సినిమా ఇది. ఫస్ట్ లుక్ తోనే ఆసక్తిని పెంచింది. తాజాగా టీజర్ ను వదిలారు
Champion Teaser
ఛాంపియన్ టీజర్ 1 నిమిషం నిడివి కలిగి ఉంది.ఇది ఒక పీరియాడిక్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తుంది. ఇందులో ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపిస్తున్నాడు.అతని పాత్ర పేరు మైఖేల్. అతను పెద్ద ఛాంపియన్ అయినప్పటికీ బ్రిటిష్ వాళ్ళ వద్ద అతను ఎందుకు బందీగా ఉండాల్సి వచ్చింది. వాళ్ళతో ఫుడ్ బాల్ ఆడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది వంటి ప్రశ్నలు రేకెత్తించే విధంగా టీజర్ ను కట్ చేశారు.
సినిమాపై ఆసక్తి పెంచేలానే టీజర్ ఉంది. రోషన్ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది. యూత్ కు దగ్గరయ్యే విధంగా అతని మేకోవర్ ఉంది. మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం బాగుంది. ప్రదీప్ టాలెంట్ ఏంటో ‘ సేవ్ ది టైగర్స్’ శాంపిల్ చూపించాడు. ఛాంపియన్ తో హిట్టు కొట్టి టాప్ డైరెక్టర్ గా ఎదుగుతాడేమో చూడాలి. టీజర్ ను మీరు కూడా ఒక లుక్కేయండి: