టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో చాందిని చౌదరి ఒకరు కాగా చాందిని చౌదరి (Chandini Chowdary) కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. బాలయ్య (Balakrishna) బాబీ (Bobby) కాంబో మూవీలో సైతం చాందిని కీ రోల్ లో కనిపిస్తుండగా ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చాందిని చౌదరి ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ వైరల్ అవుతోంది.
నిజాయితీగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నానని ఈ ప్రశ్న కూడా నేను చూసిన దాన్ని బట్టి అడుగుతున్నానని ఆమె తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో పని చేసే ఆడవాళ్లని మగవాళ్లు ఎందుకు క్యారెక్టర్ లేని వాళ్ల లాగా చూస్తారని ఆమె ప్రశ్నించారు. వాళ్లు మాట్లాడే ప్రతి మాటలో కూడా ఆడవాళ్లని తక్కువ చేసి మాట్లాడతారని చాందిని చౌదరి చెప్పుకొచ్చారు. ఇది చాలా బాధను కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుందని చాందిని చౌదరి వెల్లడించారు. ఇలాంటి చూసినప్పుడు మనసు విరిగిపోతుందని ఆమె పేర్కొన్నారు. చాందిని చౌదరి చేసిన కామెంట్లలో నిజం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇండస్ట్రీ అమ్మాయిలు అంటే ఎందుకు ఇంత చులకన అని నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.
షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ను మొదలుపెట్టిన చాందిని చౌదరి తర్వాత రోజుల్లో కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. చాందిని చౌదరి ఇతర భాషలపై కూడా ఫోకస్ పెడితే ఆమె కెరీర్ పరంగా మరింత ఎదిగే అవకాశాలు ఉంటాయి. చాందిని చౌదరి తెలుగమ్మాయి కావడం వల్లే ఆమెకు ఆశించిన రేంజ్ లో మూవీ ఆఫర్లు రావడం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
Genuine question, through my observation, Why do a lot of people especially men slut shame women who work in the film industry? Every single statement from them has a demeaning word attached to it. It’s disheartening because this line of career requires a lot of
Hard work as well