మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan ) హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నారు. పైగా దిల్ రాజు (Dil Raju) ఈ చిత్రానికి నిర్మాత. దాదాపు రూ.270 కోట్ల బడ్జెట్ తో ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన ‘జరగండి జరగండి’ పాట.. స్లోగా మంచి రెస్పాన్స్ నే రాబట్టుకుంది.
దానికి మించి ‘గేమ్ ఛేంజర్’ నుండి మరో అప్డేట్ రాలేదు. టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? విడుదల ఎప్పుడు ఉంటుంది? వంటి వివరాలు టీం గోప్యంగా ఉంచుతుంది. అయితే ఒక్కటి మాత్రం నిజం. మరో వారం, పది రోజుల్లో షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకి 3 నెలలు టైం పడుతుంది. దర్శకుడు శంకర్ ఇంకో నెల ఎక్కువగా తీసుకున్నా అక్టోబర్ నాటికి సినిమా రెడీ అయిపోతుంది.
ఈ నేపథ్యంలో ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఎప్పుడు ఉండవచ్చు? అనే డౌట్ మీకు రావచ్చు. ఈ క్రమంలో అక్టోబర్ 30 పై మేకర్స్ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఆ టైంకి దీపావళి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి.. మేకర్స్ ఆ డేట్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా అదే డేట్ కి రిలీజ్ అవ్వొచ్చు. హిందీ రిలీజ్ కోసం 3 నెలల ముందు కన్ఫర్మ్ చేయాలి కాబట్టి.. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే ఛాన్సులు ఉన్నాయి.