Kalki 2898 AD: ‘కల్కి 2898 ad’.. సెన్సార్ చేసిన సన్నివేశాలు ఏంటంటే?
- June 20, 2024 / 04:44 PM ISTByFilmy Focus
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ (C. Aswani Dutt) ఈ చిత్రాన్ని రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు యావత్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రమిది.
మరో వారం రోజుల్లో రిలీజ్ కాబోతున్న ‘కల్కి 2898 ad ‘ చిత్రం ఈ మధ్యనే సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. రన్ టైం 3 గంటల వరకు వచ్చినట్లు తెలుస్తుంది. సెన్సార్ వారు ఈ చిత్రానికి కొన్ని కట్స్ తో యు/ఎ రేటింగ్ ఇచ్చినట్టు స్పష్టమవుతుంది. ముఖ్యంగా 3 చోట్ల సెన్సార్ సభ్యులు అభ్యంతరాలు తెలిపినట్టు సమాచారం.

ముందుగా ‘కల్కి…’ పురాణాలను ఆధారం చేసుకుని తీసిన సైన్స్ ఫిక్షన్ మూవీ. కాబట్టి.. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ముందుగానే ‘ఈ సినిమా కథ కల్పితం’ అనే వాయిస్ ఓవర్ తో క్లారిటీ ఇచ్చారట. అలాగే భైరవ పాత్రను ఉద్దేశిస్తూ ‘వీడి’ అనే పదం వాడాల్సి వచ్చినప్పుడు ‘దేవుడు’ అని ప్రస్తావించారట. మహాభారతం తర్వాత 6000 సంవత్సరాలకి కలియుగం వచ్చినట్టు చూపించిన సన్నివేశాలను కూడా కల్పితం అనే రీతిలో తెలియజేస్తారట.












