ప్రముఖ నటుడు చంద్ర మోహన్ ఇప్పుడు… తండ్రి,బాబాయ్ వంటి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ‘గణేష్’ ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి చిత్రాల్లో వెంకటేష్ కు నాన్నగా.. అలాగే ‘వర్షం’ ‘డార్లింగ్’ సినిమాల్లో ప్రభాస్ కు బాబాయ్ గా, ‘దూకుడు’ లో మహేష్ కు మావయ్యగా, ‘తమ్ముడు’ చిత్రంలో కూడా పవన్ కళ్యాణ్ కు ‘మావయ్య’ గా నటించి మెప్పించాడు. ముఖ్యంగా ‘7/జి బృందావన కాలనీ’ సినిమాలో ఈయన పోషించిన తండ్రి పాత్ర.. ప్రతీ ఒక్క ప్రేక్షకుడి హృదయాల్లో నాటుకుపోయిందనే చెప్పాలి.
అంతేకాదు కమెడియన్ గా కూడా ఈయన ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన నటన కనపరిచాడు. పాత్ర ఏదైనా వందకి వంద శాతం న్యాయం చేసే చంద్ర మోహన్ గారి గురించి చాలా మందికి తెలియని కొన్ని నిజాలు ఉన్నాయి. అవేంటంటే.. అప్పట్లో హీరోగా కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు చంద్రమోహన్. ‘సుఖ దుఃఖాలు’ ‘పదహారేళ్ళ వయసు’ ‘సిరిసిరి మువ్వ’ ‘సీతామహాలక్ష్మీ’ వంటి చిత్రాలు సూపర్ హిట్ అవ్వడం.. ఆ చిత్రాలకు మహిళా ప్రేక్షకులు కూడా నీరాజనాలు పట్టడంతో … అప్పటికి ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోలు కృష్ణ,శోభన్ బాబులకు కూడా భయపడ్డారట.
కృష్ణ గారు అయితే ‘ఫ్యామిలీ సినిమాలకు చంద్రమోహన్ ఎలాగూ ఉన్నాడు కదా.. మనం రూటు మార్చాలి అని’ శోభన్ బాబుగారి దగ్గర చెప్పారట. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. చంద్రమోహన్ తో ఏ హీరోయిన్ నటించినా స్టార్ హీరోయిన్ అయిపోవడం గ్యారంటీ అనే సెంటిమెంట్ కూడా అప్పట్లో ఉండేదట.దివంగత శ్రీదేవి,మంజుల, రాధిక, జయసుధ, జయప్రద, విజయశాంతి, తాళ్లూరి రామేశ్వరి, ప్రభ.. వంటి వారు చంద్రమోహన్ సినిమాలతో పరిచయమయ్యి స్టార్ హీరోయిన్లుగా ఎదిగారట.