Chandramukhi2: ‘చంద్రముఖి 2’ కోసం టీమ్‌ వచ్చేసింది.. సెంటిమెంట్‌ కోసమా?

రామోజీ ఫిలిం సిటీని మీరెప్పుడైనా విజిట్‌ చేశారా? ఓ బస్సెక్కించి ఫిలిం సిటీ అంతా తిప్పుతున్నప్పుడు ఓ పెద్ద బిల్డింగ్‌ను చూపిస్తారు. ఇప్పటితరం కుర్రాళ్లకైతే ఇది ఆ సినిమాలో స్కూలు, ఇది ఈ సినిమాలో హాస్పిటల్‌ అనిపిస్తుంది. అయితే కొంచెం వెనకటి తరం వాళ్లకైతే.. అది ‘చంద్రముఖి’ బిల్డింగే. అంతేకాదు ఫిలింసిటీ టీమ్‌ కూడా అదే మాట చెబుతుంది. ‘లక లక లక..ఇదే చంద్రముఖి బిల్డింగ్‌’ అని అంటారు అని చెబుతుంటారు. ఇప్పుడు ఆ బిల్డింగ్‌ గురించి ఎందుకు అనుకుంటున్నారా?

ఉందీ.. కారణం ఉందీ. ఆ రోజుల్లో ఆ బిల్డింగ్‌లో సినిమా షూటింగ్‌లు అయితే సినిమా హిట్‌ అనే ఓ నమ్మకం ఉండేది. అంతేకాదు ‘చంద్రముఖి’లో ఆ బిల్డింగ్‌ సూపర్‌గా ఉంటుంది. ఆ రాజసం, ఆ ఫీల్‌ మామూలుగా ఉండవు. మరి అందుకో, లేక సెంటిమెంట్‌ వల్లనో కానీ ‘చంద్రముఖి 2’ టీమ్‌ రామోజీ ఫిలింసిటీకి వచ్చేసింది. అవును కొత్త ‘చంద్రముఖి’ షూటింగ్‌ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో సాగుతోందట.

‘చంద్రముఖి 2’తో మరోసారి భయపెడుతూ అలరించడానికి సిద్ధం అని ఆ మధ్య దర్శకుడు పి.వాసు అనౌన్స్‌ చేశారు. అందులో లారెన్స్‌ ప్రధాన పాత్రధారి అని ప్రకటించారు కూడా. అప్పుడు ఏర్పడిన చిన్న ఇంట్రెస్ట్‌… ఆ తర్వాత అందులో చంద్రముఖిగా కనిపించబోయే నాయిక ఎవరు అని చెప్పాక డబుల్‌ అయ్యింది. ఎందుకంటే రెండో ‘చంద్రముఖి’గా కనిపించేది బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌.

‘చంద్రముఖి 2’లో రాజనర్తకిగా నటించడానికి కంగనా రనౌత్‌ను తీసుకుంది టీమ్‌. సినిమాకు పాన్‌ ఇండియా టచ్‌ ఇచ్చే ప్రయత్నంలోనే ఈ ఎంపిక అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో లారెన్స్‌ తదితరులపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షూట్‌ కోసం ప్రత్యేకంగా సెట్లు వేశారట. మరోవైపు ఈ సినిమా చిత్రీకరణ కోసం కంగన రనౌత్‌ మంగళవారం హైదరాబాద్‌ చేరుకుంది. షూట్‌ ముందుకెళ్లే కొద్దీ ఏమైనా అప్‌డేట్స్‌ వస్తాయేమో చూడాలి.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus